నేస్తమా… ఎన్నాళ్లకో మళ్లీ మన కలయిక!!??
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: విస్సాప్రగడ పద్మావతి
నేస్తమా …
ఎన్నాళ్ళకో మళ్ళీ మన కలయిక
బరువెక్కిన గుండె
తేలిక పడేదెన్నడో
అరమరికలు లేని
అనురాగాల మేళవింపు
మనస్నేహం
జ్ఞాపకాల తెరలు
కళ్ల ముందు కదలాడుతున్నా
బతుకుపోరులో
ముందుకు సాగకతప్పదు
వీడ్కోలు నేస్తమా…!
చెవులు కొరుక్కున్న
గుసగుసలు
అప్పుడప్పుడు
తీపి అలకల
రుసరుసలు
అన్నిటిని మనసులో
పదిలంగా దాచుకుంటా
మన ఇన్నాళ్ల బంధం
ఓ తీయని స్వప్నం
మది నిండుగా
ఎప్పటికీ తోడుండే
ఆత్మీయ అనుబంధం
చెప్పక తప్పదు మరి
నేస్తమా ..
ఎన్నాళ్ళకో మళ్ళీ మన కలయిక….
Good Padmavati. బాగుంది వీడ్కోలు, మళ్లీ ఎపుడు కలుస్తనా అనే ఆశ తో. Super