ఆషాఢ ఆకాశం

ఆషాఢ ఆకాశం

చంద్రకళ. దీకొండ

ఆకాశంలా పేరుకు శూన్య మాసమైనా…
కలవెన్నో వింతల పాలపుంతలు…
మనసుకు కలుగు పులకరింతలు…!
దాహార్తితో ఎండిన ప్రకృతికి…
వానచినుకుల తొలకరి పులకరం…
నదులు,చెరువులకు జలకళతో
కళకళలాడే ఆహ్లాదం…
అన్నదాతలకు క్రొత్త ఆశలు
చిగురించే సమయం…
ఏరువాక సాగే సంబరం…!
అతివల పండిన గోరింటాకు చేతుల్లో…
చుక్కల నడుమ ఎర్రని
జాబిల్లి ఉదయం…
ఆరోగ్యకరమైన ఆచారపు మురిపెం…!
పసుపు పూసిన ముఖాలతో…
వేపమండలు చేతబూనిన
బోనాల జాతరతో…
చుట్టుముట్టే వ్యాధులకు ఆమడ దూరం…!
వస్తున్నాయ్… వస్తున్నాయ్…
అంటూ కదిలే…
జగన్నాథ రథచక్రాల వైభోగం…!
నూతన వధూవరులకు…
పరమార్థాన్ని కలిగిన
ఎడబాటును కల్పించి…
తీపి కలయికను రుచి
చూపించే ఆచారం…!
మన సంస్కృతిలో కలవెన్నో
నియమాల ఆచారాలు…
సందడితో నిండిన సాంప్రదాయాలు…
ఆరోగ్యాన్ని అందించే వ్యవహారాలు…
ఆచరిస్తే కలుగును అందరికీ మేలు…!!!

***

 

You May Also Like

One thought on “ఆషాఢ ఆకాశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!