ఆగిన పయనం

ఆగిన పయనం

రచన:: క్రాంతి కుమార్ (ఇత్నార్క్)

నవ్వుతు మాట్లాడుతున్న పెదవులకు తెలియదు
మదిలో రాగం తీసిన స్వరం ముగబోతుందని

కలల లోకాన్ని చూసే కనులకు తెలియదు
అంధకార ప్రపంచం పరిచయం అవుతుందని

పిచ్చిగా ప్రేమించే మనసుకు తెలియదు
అంతులేని వేదన దరికి చేరుతుందని

జంటగా నడిచినా అడుగులకు తెలియదు
గమ్యం లేని గమనంలో సాగిపోవాలని

హాయిని అనుభవిస్తున్న తనువుకు తెలియదు
నిర్జీవమైన జీవితాన్ని ఇక ప్రారంభించాలని

చల్లని వెన్నెలలో ఊసులు విన్న చెవులకు తెలియదు
సంతోషించే ఊసులు చెప్పే మనసు ఇక రాదని

ఒకే శ్వాసగా జీవించిన ప్రాణానికి తెలియదు
జీవితాంతం తోడుగా ఉంటానని చెప్పిన ప్రాణం లేదని

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!