వెన్నెల్లో పిల్లాడు!
బి హెచ్.వి.రమాదేవి
ఓ పిల్లోడా! వెన్నెల్లో పిలగాడా.
ఆచూపుల తూపుల కాంతులు!
ఏవో పచ్చని బుగ్గల నీడలు!
వెచ్చని వలపుల సందడులు!
కళ్ళల్లోకళ్లుపెట్టేకలవరం
నాచెవుల జుంకీలలో పరవశం!
చేతుల సంకెళ్ళ మరు వశం!
గరుక గడుసుదనగడ్డపువేషం!
రెండు చందమామల తో వేగి,
నిండు పున్నమి మోమున క్రాగి,
పండు వెన్నెల వాకన తడిసి,
గుండు మల్లెల మత్తులో సోలి.
మోవిపైముద్దులముద్రలో విరిసి
నీకోసంతపిస్తున్నఅందాల రాశి
మన మేనులు రెండైన ప్రియా! నీవూ,నేనూ ! ఒకేఆత్మ కదా!
……