ఓం గురుభ్యోనమః

ఓం గురుభ్యోనమః

రచన:: తొర్లపాటి రాజు(రాజ్)

ఆర్యా…ఆది నుండి
జిజ్ఞాసకు
ఆధ్యుడువి నీవే.. ఆరాధ్యుడువీ నీవే
విద్యార్థికి
వికాసము నీవే.. వినోదమూ నీవే
యువత భవితకు
బాటవి నీవే..బలమూ నీవే

ఆచార్యా…
అభ్యాసకుడుకి
ఆత్మజ్ఞానివి నీవే.. ఆలోచనిచ్చేదీ నీవే
సాధకుడకు
సాధనము నీవే.. సానపెట్టేదీ నీవే
క్రమశిక్షణకు
క్రియారూపం నీవే.. క్రియాశిల్పివీ నీవే

ఓ గురువర్యా…
మట్టిబుర్రకు
మెరుగు పెట్టేది నీవే..మకిలి కడిగేదీ నీవే
అల్పుడునైనా
అందలమెక్కించేది నీవే..అంతు చూసేదీ నీవే

ఓ ఆర్యా
మానవతకు
మార్గం వేసేది నీవే.. మరో రూపమూ నీవే
సమాజానికి
సందేశం నీవే.. సన్మార్గమూ నీవే
నవ నాగరికతను నేర్పేది నీవే..
మన నాగరికతను కాపాడేదీ నీవే
దేశానికి
దిశా నిర్దేశం నీవే..దశ మార్చేదీ నీవే

కడకు దేవునికైనా
దీవెనలిచ్చేది నీవే.. దివ్యత్వమిచ్చేదీ నీవే
జగమంతా జపించే జ్ఞానివి నీవే
జన జయ ధ్వానాలు పొందాలి నీవే..నీవే

………

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!