ధీర పురుషుల రాజ్యాంగం

ధీర పురుషుల రాజ్యాంగం

రచన:: వడ్డాది రవికాంత్ శర్మ

ఇంతటి వైవిధ్యానికి పుస్తకరూపం …./
ఇలపై ఎన్నో శ్రమల కోర్చి రాసిన పవిత్ర గ్రంథం ../
పరిశీలించిన ప్రపంచ వాఙ్మయం …/
ముందే ఊహించిన రేపటి గణతంత్ర సిద్ధాంతం ../
భారత రాజ్యాంగం అది భువిపై ప్రశంసనీయం ../

శాంతికాముకం నాటి స్వాతంత్య్ర సమరం ../
జాతి భద్రతకై రాజీపడని అధికరణల పర్వం ../
హక్కులకై తిలక్ చిందించిన నెత్తుటి తిలకం ../
సర్వజనోద్ధరణ దిశగా గాంధేయ రాజ్యాంగం …/

చెక్కు చెదరని విలువైన గ్రంథం …/
ప్రపంచ ప్రజాస్వామ్యంలో అగ్రతాంబూలం …/
ఠాగూర్ కలలుగన్న శాంతినికేతనం ../
వివేకానందుని శాస్త్రీయ ప్రసంగం ../
పౌరుల బాధ్యతల అధ్యయనంలో అది సుస్పష్టం …/

అరవిందుని మేధో మథనం …/
రాయలు కోరిన దేశభాషల సముచిత స్తానం…/
పేరు ప్రస్తావించని ధీర పురుషుల భావజాలం ../
భారత రాజ్యాంగం …. అది నవయుగ మహాభారతం …/

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!