మనమంతా ఒక్కటేనా..??”

మనమంతా ఒక్కటేనా..??

రచయిత :: క్రాంతి కుమార్ ( ఇత్నార్క్ )

మనమంతా ఒక్కటే..
కులం లేనంత వరకు
కష్టాలు రానంత వరకు
దూరంగా ఉన్నంత వరకు
మతం తెలియనంత వరకు
డబ్బుకి విలువ లేనంత వరకు

మనమంతా ఒక్కటే..
స్వార్థం దరి చేరనంత వరకు
అసూయ ఆవహించనంత వరకు
గొప్ప స్థానానికి చేరుకోనంత వరకు
మనలోని పసితనం వీడనంత వరకు
అవసరాలలో లాభం తెలియనంత వరకు

బాహ్యంగా పైకి కనిపించే
మనమంతా ఒక్కటే..!!
అంతరంగంలో కనిపించని
మనమంతా ‘ఒక్కటేనా..??’

 

You May Also Like

4 thoughts on “మనమంతా ఒక్కటేనా..??”

    1. థ్యాంక్స్ 🤗 అక్క

    1. థ్యాంక్స్ 🤗 ఎమ్మెల్యే గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!