వివాహబంధం

వివాహబంధం

రచయిత :: సరిత రవిప్రకాష్

విడి పోని బంధం.. విడదీయరాని బంధం అందమైన వివాహ బంధం..

సృష్టి లో ఎన్ని బంధాలున్నా ఎన్ని సంబంధాలున్నా
తనివి తీరనిదీ ప్రేమానురాగాలకు పునాది వివాహ బంధం….

పసుపు చందనం పూసుకొని పసుపు తాడుతో ముడి వేసుకొని
ఏడడుగులతో నూరేళ్ళు బ్రతకలంటూ ముడివేసేది వివహబంధం…

ఎక్కడో పెరిగి తెలియనివారిని మనువాడి పాత బంధాలను వీడి

కొత్త బంధాలకు పునాది వేసి ప్రేమను పంచుకుంటూ

పెంచుకొంటూ పోయే బంధమే వివాహ బంధం….

కోపాలు,తాపాలున వడి దుడుకులు సహజమే అన్నీ దాటుకుని

ముందుకు నడపాలి నడవాలి ఇరువురు కలిసి

కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినా సర్దుకుని పోవాలి అదే వివహబంధం….

ఎన్నో కొత్త బంధాలు
పెన వేసుకొన్నా
మరెన్ని పాత బంధాలు తెగిపోతున్నా మన ఇద్దరి బంధమే శాశ్వతమని
తెలిపేలా ముందుకు సాగేదే వివహబంధం…..

ఆనందంతో వున్నది ఎన్ని వివాదాలు వచ్చినా

ఈ వివాహ బంధం విబేధాలే చందనం గా పూసుకొని వున్న బంధం ఆనందంతో వున్నది

ఈ వివాహ బంధం ఇది వివాహ బంధం కనుకనే..
అందుకే ఇది అందరికీ కానుకే….

వివాహ బంధం మంటే…?
ఇరవై నుంచి అరవై వరకు
అలుపెరగని బంధమే
ఆలుమగల బంధమే
వివాహబంధం….

ఊసరవెల్లిల రంగులు మారుస్తూ జీవించేది కాదు ఈ బంధం,
కడ వరకు నిలిచి వుండేది వివాహబంధం…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!