నడి ఈడు పెళ్లికి ప్రకృతి మంతనాలు

నడి ఈడు పెళ్లికి ప్రకృతి మంతనాలు

రచన: పావని చిలువేరు

ఎంత సక్కగున్నావే
నా ముసలి పడుచు పిల్లదాన ,

అప్పుడే చిగురించిన మొక్క ఓలే
పాలుగారే ఈడు లోనే,
ఏధో ఎత్తిపోయినట్టు
నా గుండె చేరితివి.

గలగల పారే సెలయేరు లాంటి  నీనవ్వుతో,
కష్ట సుఖాలలో  ఓలలాడుతూ,
చేయి చేయి పట్టుకొని,
సంసార సాగరాన్ని అవలీలగా
ప్రేమతో ముడి వేసుకొని ,
50వ వసంతాలలో అడుగిడితిమీ .

ఎంతటి ఆశ్చర్యం
ఈ ఏల పెరటిలోని సన్నివేశం అబ్బురపరిచే.

భలే…ప్రకృతి మన పెళ్లికి
మంతనాలు చేస్తున్నట్టు గోచరించే .

అరిటాకు పందిరి కింద
నా  బొండు మల్లె కోమలాంగి …..
నిన్ను చూసి ఈ నడి వయస్సున మళ్లీ సిగ్గుపుట్టే .

నిండు సందమామా ఓలే బోసి నవ్వుతో
పండు వెన్నెలై మళ్లీ నా చేతిలో వాలిపోతివి .

ప్రకృతి తోడుగా
అర్ధ శతాబ్దపు మన పెళ్ళికి
నలుగు రుద్ధి, మంగళ స్నానాలు చేయించడానికి
సరిగంగ పయణమైoది .

పంచభూతముల సాక్షిగా
జడి వానకి ముందు తొలకరి జల్లులు ,
మరియు
పడి ఎలిసిన వాన లో మిగిలిన
తుప్పర చినుకు లిరువురు అక్షింతలైరి .

పుస్తె కట్టే సమయాన పెళ్లికూతురుగా
మళ్లీ  నా మీద కూసున్న తీరు గుర్తువచ్చి
మురిసి పోతిని .

తీగలా నన్ను చుట్టి గిలిగింతలు పెడుతున్న
లాలపోసి జోలపాడిన  నీ చేతులను  పెనవేసుకొని
నూరేల్ల మన పెళ్ళిరోజు కోసం
కళ్లల్లో  వొత్తులేసుకొని ఎదురు చూస్తూఉంటా.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!