ఒక్కసారి ధైర్యం చూపు!
రచన: బిహెచ్.వి.రమాదేవి
ఒక్క సారి బలహీనత వస్తుంది
మరో సారికష్టంముందుంటుంది
ఇంకోసారి విధి నిన్నుఓడిస్తుంది
ఇదే సారి నిను కాలంఆడిస్తుంది
అయితేనేమి!? ఓ ర్పుగావుండు
మంటలను కన్నీటితో ఆర్పు!
పంటలను పండించు కలల తో,
అనుభవంతోముందుకునడువు
నిన్నటి కష్టం రేపు తీరిపోతుంది
మొన్నటి పని నీకుపాటవంనేర్పి
గెలుపు మలుపు నీకుతెస్తుంది. మధురమైన ఆనందం నిస్తుంది.
అందుకే చెబుతున్నా విను!
ఒక్కసారి ధైర్యం గా నిలబడు!
చక్కనైన భవితనీముందుండు!
కలలను ఎగురవేయడం నేర్చు!
అది అద్భుత భవిత చేకూర్చు!
***