నువ్వంటే నాకు అమిత మైన ఇష్టం

నువ్వంటే నాకు అమిత మైన ఇష్టం

రచన: జాధవ్ ముకుంద్ రావు

నీ బంగారపు అందమే నా ప్రపంచం
నీ కళ్ళు ద్వారానే జ్ఞాపకాల వర్షం
నీ మౌనమే నాకో అపురూప సౌందర్యం
నీ మనసులో గొప్పగా ఉంచేది నా సర్వస్వం !
నీ లోపలికి హృదయ అవేదన నా క్షణం
నీ ఉత్తేజం చూసి అనిపించే నా ఒంటరితనం
నీ తో మాట్లాడే క్షణమే యుగమతో సమానం
నీ పరిచయమే నా కళ్ళలో సంచరించే ప్రాణం !
నీ స్పర్శమే చేరువైనంత నా దృష్టిలో ఆనందం
నీ కంటి రెప్పల లో దాగిన నా అంతరంగం
నీ స్వరూపమే నా జీవితానికి మమతానురాగం
నీ లో మధురంగా దాచుకున్నది నా జీవిత గౌరవం!
నీ హృదయంలో ప్రేమ బీజాలు నా అంకితం
నీ చిరునవ్వుల చిందు నా జీవితానికి వరం
నీ తను ఆకర్షణమే నా మనసుకు అమృతపానం
నీ నిర్భయ శక్తి ఔదార్పు నా తనంలో మహాబలం!
నీ తలపుల్లో ముంచేసిన అది నా మనస్తత్వం
నీ ఆశయమే నా జీవితానికి ఆశాలకిరణం
నీ సుగంధ పరిమళాలు నాకు అపార ఉత్సాహం
నీ పాదాలలో దాచుకున్న నా ఆలోచనల స్వప్నం !

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!