విశ్వ విజేత

విశ్వ విజేత

రచన: అయిత అనిత

చిందులేసే చిరుదరహాసం అధరాలసొంతమైతేనే
మనసుబంధం మొగ్గలేస్తుంది!
దిగులుమాయమై మది దూదిపింజవుతుంది!!

బాధలభారం జీవిత భుజాలకెక్కినప్పుడు
వేదన నిశి సంతోషాలను కమ్మేసినప్పుడు
కష్టాలవ్యాధుల గమనానికి సోకినప్పుడు
హాస్యం ఔషధమవుతుంది!

అనునిత్యం నవ్వులపూవులు పూయిస్తేనే
హృదయప్రశాంత సంద్రమై అలరిస్తుంది!
పరులమనసు స్నేహహస్తమై సేదరీరుస్తుంది!!
ఒత్తిడుల దండయాత్రలోనూ
ప్రసన్నవదనం పరిమళిస్తూ విశ్వవిజేతను చేస్తుంది!

ముఖవ్యాయామమై వర్ఛస్సును వరిస్తుంది!
పంతాలను అంతంచేస్తూ చింతలను తరిమేస్తూ ప్రేమవారధౌతుంది!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!