అవసరాల బొమ్మ

అంశం: నేనో వస్తువుని

అవసరాల బొమ్మ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

తల్లిదండ్రులను వదలలేని నేను
అన్నదమ్ముల అండ కోరే నేను
అల్లారు ముద్దుగా పెరిగిన నేను
ఆడపిల్లను అవటంతో అందర్నీ మరువాలి నేను

నీ అవసరాలను అనుసరించితిని
ఆనందంగా నన్ను మలచుకొని
నా మదిలోనే నేను మురుసుకుని
నాకు ప్రేమను పంచమని వేడుకుని

పిల్లలపై ప్రేమతో ఆట వస్తువుగా మారితిని
భర్త మీద ప్రేమతో నన్ను నేను మార్చుకుని
భందాలు భారం కాదు భాద్యత అనుకోని
నా మనసుని చంపుకున్న ఓ రోబోని

నాకు జరగలేదే అన్యాయమూను
ఉనికిని మరువటం సంస్కృతి మాత్రమేనేమో
ఆడవారు పాటించే ఆనవాయితి ఇదేనేమో
తనని తాను మరచి, ఒద్దికగా ఒదగాలేమో

ఒకే రకం వస్తువును కాను నేను
అవసరాలను బట్టీ మారుతుంటాను
ఏ అవసరమైన ప్రేమగా తీరుస్తాను
అందరూ నా వాళ్లు అనుకుంటాను

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!