నేను స్త్రీమూర్తిని

అంశం: నేనో వస్తువుని

నేను స్త్రీమూర్తిని
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: పరిమళ కళ్యాణ్

నేను స్త్రీమూర్తిని
నేనొక మహిళను
నేనొక ఆలిని, నేనొక తల్లిని
నేను ప్రేమకు ప్రతిరూపాన్ని;
అవసరమైన వేళలో ఆదిశక్తిని,
నాకు అపకారం చెయ్యాలని చూస్తే
నేనొక అపరకాళిని..
కానీ ఓ పురుషుడా,
నీకు మాత్రం నేనో వస్తువుని
నీకు వంట వార్పు చేసి పెట్టే
పనిమనిషిని;
నీకోసం పిల్లల్ని కని పెంచే యంత్రాన్ని;
నీ అవసరాలను, సుఖాలను
తీర్చే ఆటబొమ్మని;
నువ్వు కొడితే, తిడితే పడే బానిసను;
మనసులేని రాతి విగ్రహాన్ని,
జీవం లేని మట్టి బొమ్మని;

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!