అంశం: మన్మధబాణం
స్వప్నచకోరం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: డా!!బాలాజీ దీక్షితులు పి.వి
నేనో
వెన్నెల ఖజానా…
నీవో
మల్లెల నెరజాణ!
నేనో
కవన ప్రభంధం…
నీవో
ప్రణయ అనుబంధం!
నేనో
హసమయ ప్రభాతం…
నీవో
రసమయ కిరణం!
నేనో
పరిమళ ధూపం…
నీవో
విరసే కుసుమం!
నేనో
నవ వసంతం…
నీవో
శృంగార తంత్రం
నేనో
మధనబాణం
నీ కనుల రెప్పల పై
వాలిన స్వప్న చకోరం