ఉపాధ్యాయుడు

ఉపాధ్యాయుడు

రచన: బుదారపు లావణ్య

అమ్మానాన్నలు జీవితాన్ని ప్రసాదిస్తే
ఆ జీవితాన్ని అర్థవంతంగా మలుచుకునే కళను ఉపాధ్యాయుడు నేర్పిస్తాడు….

అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడే విద్యార్థులకు జ్ఞాన సంపదను ప్రసాదించే దైవం ఉపాధ్యాయుడు…..

స్వర్ణకారుడు ముడి బంగారాన్ని
ఆభరణంగా మలిచినట్టు విద్యార్థిని వివేకవంతుడిగా తీర్చిదిద్దే దైవం ఉపాధ్యాయుడు….

పేద ధనిక కులగోత్రాల తారతమ్యం లేకుండా
విద్యార్థులందరినీ ఒకే స్థాయిలో ఆదరించే దైవం ఉపాధ్యాయుడు….

ఆశయ సాధనకు ఆయుదంలా
నిరాశలో స్పూర్తినిచ్చే స్థైర్యంలా
నిరంతరం గెలుపు దిశకై ప్రోత్సహిస్తూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించేదైవం ఉపాద్యాయుడు.
******

You May Also Like

One thought on “ఉపాధ్యాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!