వలపు గంధం

అంశం: మనస్సాక్షి

వలపు గంధం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సుజాత.పి.వి.ఎల్

రెండు మనసులు..
మూడు ముళ్ళతో పెనవేసుకున్న పవిత్ర బంధం..
వేద మంత్రాలు
మంగళ వాయిద్యాల నడుమ
మనస్సాక్షిగా
కొంగు ముడితో ఏకమైన అనురాగ బంధం..
అరుంధతి అనుగ్రహంతో జరిగే పాణి గ్రహణం..
నూతనోధ్యాయ దాంపత్య జీవితానికి ఆగమనం..
సంఘంలో గౌరవ ప్రతిష్ఠలకు నిలువెత్తు నిదర్శనం..
బాధ్యతాయుత సహజీవనం..
నిరంతర వాత్సల్య తరంగ పరిపూరితం..
ఆచంద్రార్కం ఇల నిలిచే
‘వలపు గంధం’..ఆలుమగల బంధం!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!