మాట తప్పిన మనసు

అంశం : అందమైన అబద్ధం

మాట తప్పిన మనసు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: పోలగాని.భానుతేజశ్రీ

నమ్మిన మనసుని నట్టీట ముంచడం
ఒక ప్రేమ వల్లనే సాధ్యం అనుకుంటా.
మాయమాటలు తేనెల తియ్యగా వినిపిస్తూ
వెనుక కందిరీగల గాట్లు పెడుతూ.
అందమైన అబద్ధాలతో హరివిల్లులు చూపిస్తూ
మచ్చ లేకుండా మనసుని మోసం చేయడం.
మాయమాటల వలలో  చేపపిల్లలా
చిక్కుకున్న ఎన్ని మనసులు ఉన్నాయో.
మోసం అనే ముసుగు వేసుకొని
పైకి ప్రేమ పువ్వుల వాన కురిపిస్తూ
వెనుక నమ్మకద్రోహం అనే బాంబులు పేలుస్తూ
తీయని అబద్ధాలు తియ్యతియ్యగా  తినిపిస్తూ
మాట తప్పి మరో మనసుని చంపిన మనసులు ఎన్నో

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!