ఊపిరి కొసపై ప్రాణతీపి

.
ఊపిరి కొసపై ప్రాణతీపి

రచయిత: చలిమేడా ప్రశాంతి

ఆరేళ్ల పసిపాప ఆడుతూపాడుతూ స్వేచ్ఛా విహారం
నిమిషంలో కుప్పకూలిన వైనం తల్లిదండ్రుల ఆవేదన
వైద్య పరీక్షల ఫలితం కరోనా  మహమ్మారి విలయతాండవం ఊపిరి కోస పై ప్రాణ తీపి తో ఆ పాపా ఆరాటం.
కుటుంబ పోషణ  వలస బాటా పట్టిన 25యేళ్ళ యువకుడి ఉద్యోగ ప్రయాణం తన శ్వాసలో ఇబ్బంది
కరోనా ఉచ్చులో  చిక్కుకున్న బాధితుడుగా గుర్తు తెచ్చుకున్నా బాధ్యతలు మనోవేదనతో పోరాడుతున్నా
ఆ యువకుడి ఆఖరి దశ ఊపిరికోసలో ప్రాణతీపి.
60 ఏళ్ల వృద్ధుడు తనవారితో ఆనందంగా గడిపే క్షణం
చివరిదశ తన వారి మధ్యలో జరగాలానే  ఆశ
ఒంటరిగా  సాగిపోయిన ఘోరం కారణం కరోనా
వైద్యం చేసిన వ్యక్తి ఆకస్మాత్తుగా ఒంటరి మరణశయ్యపై ప్రయాణం.
రక్షణగా నిలిచిన జవాన్ కి ప్రాణాపాయ స్థితికి చేరిన దుస్థితి.
ఎవరు చేసినా అధర్మం ఎవరి ప్రాణాల సంకటణ
ఎవరు చేసిన అన్యాయం ఎవరికి స్వేచ్ఛను దోచుకొనేను
ఎవరు తప్పిన నీతి ఎవరిని  ఊపిరి కోస ప్రాణాలాతో చెలగాటం ఆడేను.
ఆరేళ్ల పసిపాప ఆనందమా 25యేళ్ళ యువకుడి బాద్యతలా 66యేళ్ళ  వృద్దున్ని చివరి కోరికనా వైద్యమే
ధర్మంగా  ఉన్న వైద్యుడిదా రక్షణగా ఉన్న పోలీసులా దా
కరోనా మహ్మమరి కోరల్లో చిక్కుకునే అమాయకులదా.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!