నీ ప్రేమబానిస

నీ ప్రేమబానిస

రచయిత:విజయ మలవతు

నువ్వొదిలెళ్లిన గాలి కూడా అగ్నిలా మారి నన్ను దహించి వేస్తున్నదే…!
గుండెల్లోని తియ్యని మాటలే
బాణాలై గుచ్చుతున్నా ఊపిరాపక..

నువ్వు రావని తెలిసినా..
నువ్వోచ్చే రహదారిలో నా కంటి వెలుగులే పరచి నిలుచున్నా నీ రాకకై ఎదురే చూస్తూ…
ఆ భానుడినే
ప్రశ్నిస్తున్నా నీ దరిచేర్చే దారి చూపుమని..

నా కంటి చెమ్మ నే అడిగా ఊహల్లో నీ రూపం కరుగనివ్వకని …
జీవితానికి ఆ ఊహలే నా ఓదార్పు అని..
నా ఊపిరినే అడిగా నీ నుండి పీల్చిన గాలి పరిమళం పోనివ్వకని….
జీవితానికి ఆ గాలే నా ప్రాణవాయువు అని..

నా అధరాలనే అడిగా నీ తియ్యదనం వదలనివ్వకని..
జీవితానికి ఆ తియ్యదనమే మిగిలెను అని..
నా చెవులనే అడిగా నువ్వు పలికే మాటలు ఆపనివ్వకని..
జీవితానికి ఆ తరంగాలే నా హృదయలయలు అని.

నా చేతి వేళ్ళనే అడిగా వాటి మధ్య ఉన్న నీ చేతి స్పర్శనే మరువకని..
జీవితానికి దారి చూపే సూచికలే అవే అని..
నా అడుగులనే అడిగా నీ పాద ముద్రలే చేరపనివ్వకని..
జీవితానికి నా చిరునామా అవే అని..

నీ ప్రేమ పరిచయంతో నన్ను నేను మరచినా
నీ ఊహలే నా ప్రాణధారం ..

***

You May Also Like

2 thoughts on “నీ ప్రేమబానిస

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!