మాటలకోటలు

అంశం: అందమైన అబద్దం

మాటలకోటలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

పసితనంలో బువ్వతినిపించడానికి అమ్మచూపే చందమామ
ఎదుగుతున్నప్పుడు నాన్ళ ఊరించే ఊహలప్రపంచం
వయసువేడిలో మొదటివలపుతో చేసే బాసలు
నమ్మినసహచరికి అన్నిటికి నేనున్నానని చెప్పే తీపికబుర్లు
రోగికి జబ్బునయం కావలంటే తీపిగుళికలు తినిపించాల్సిందే
మాటలకోటలు కట్టి మాయాలోకంలో విహరింపచేయటమే
ఆవలతీరంలో అద్దాలమేడలో కలసుందామని
ఆశలురేపడం
ఆశలురేపి మనసునుమాయజేసి మరో మనసుతో
ఆటలాడుకోవడమే
అందలాలెక్కిస్తామని అందమైన అబద్దాలతో
ఆశలు పెట్టె నాయకులే ఎక్కువ
అరచేతిలోనే అన్నీ తెచ్చిపడతామని చెప్పే కపట
సన్యాసులు చెప్పేవి అందమైన అబద్దాలే
పీకల్లోతుల్లోకి కూరుకుపోతున్న సగటుజీవిని
పైకి తెస్తామని చేప్పేవి కూడా అందమైన అబద్దాలే
అప్పుల ఊబిలోకి దిగిపోయిన రైతన్నకు రుణమాఫిల
తంతు కూడా అందమైన అబద్దమేగా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!