ప్రేమ కావ్యం

ప్రేమ కావ్యం

రచయిత:: సావిత్రి కోవూరు


విరులన్ని పోగు పోయనా, తావులు నీకై దాయనా
హరివిల్లై నేనుగా మారనా, నీ ముంగిట ముగ్గై నిలువనా
నీ పదముల పదమై సాగనా, నా ప్రాణము నీవని తెలుపనా
నా మదినే నీకై తెరవనా, నీ చిత్రం దానిలో చిత్రించనా
నా మది పుస్తకము తెరువనా, నీ తలపుల పంక్తులు రాయనా
నా మనసే నీదని తెలుపనా, నీ జీవనజ్యోతిగా వెలుగనా
నీ అడుగులో అడుగే వేయనా, నా అండే నీవని తెలుపనా
నీ చేతిలో చెయ్యేసి తెలుపనా, ఈ చెలి నీదే నందునా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!