రంగుల చిత్రం
రచయిత:అనురాధ కోవెల
చేరలేని తీరంలో ఉన్నప్పటికీ
నా మనసు పొరల్లో దాగిన
నీ రూపం విలువ ఎంతంటే
నా ఆరాధనంతా కుంచెలో చేర్చి
కాన్వాసుపై కుమ్మరిస్తే
నాకు తెలియకుండానే వచ్చే నీ రూపుకు
ప్రాణం వచ్చి నన్ను లాగేసుకుంటే
ఎందుకు నన్ను దూరం చేసావు అంటూ
ఏదో ఒక వర్ణంగా మారి
నీలో కలిసిపోయేటంత.