అంతులేని కథ

అంతులేని కథ

రచయిత ::జీ వీ నాయుడు

అంతులేని కథ ఒకటుంది ఓపికగా చదువుతారా…?.
మానవత్వం ఉన్న మనందరం చదివి తీరాలి, చేయి చేయి కలిపి ఆచరించాలి.. ఇదే మనం జన్మ నిచ్చిన కన్న తల్లికీ, అన్ని విదాలా భరిస్తున్న పుడమి తల్లికీ అందించే గౌరవం. ఇదే కథా సారాంశం… ఓ లేఖ రూపం లో.
ఓ నా ప్రియతమ ప్రజలారా,, మనం అందరం సమిష్టి గా ఈ అంతులేని కథను చేదించాలి. నిత్యం పిట్టల్లా రాలుతున్న వారిని చూస్తున్నా మనలో చలనం లేదు. రోజు వందలు వేలు ఖర్చు చేసి వ్యసనాల ఊబిలో కొట్టుమిట్టాడే బదులు ఒక వ్యాక్షిన్ వేయించుకోరు.. కారణం దాన్ని కూడా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి అంటారు.
ఉచిత ప్రభుత్వ పధకాలు ఉన్నంత వరకు మనలో ఈ తరహా జాడ్యం రాజ్యమేలుతునే ఉంటుంది. పాలకులు కూడా ఏదో ఓ తరహాలో ఓట్లు వేయించుకునే ప్రక్రియల్లో తాయిలాల తో జనానికి మత్తు ఎక్కిస్తున్నారు.. దేశం లోని ప్రజలందరికి వ్యాక్షిన్ వేయించే ప్రక్రియ కు శ్రీకారం చుడితే కొందరు అయినా ప్రాణాలు దక్కించుకునేవారు. అటు పాలకులు, ఇటు మనం కూడా కరోనా కట్టడిలో వెనుకబడుతున్నాం. దేశం లోనూ, రాష్ట్రాలలోను, మనందరి కుటుంబాల్లోను ఆర్ధిక వ్యవస్థ పతనం అయింది. సోనో సూదో లాంటి వారు అనేకులు ముందుకు రావాలి. కోట్లు ఉన్నా కరోనా కోరల్లో బంధీ కావాల్సిందే. కనీసం మానవతా విలువలు చూపి, కొంత సొమ్మును అటు ప్రభుత్వాలకో, సోనో సూద్ లాంటి ప్రజా సేవకులకు అందించినా ఆ సొమ్మును వ్యాక్షిన్ కోసం ఉపయోగ పడేది.. బడా బాబులు, స్విస్ బ్యాంకులకు తాళం తీస్తే ఒక్క రోజు కరోనా మాయం అయ్యేది.. అందుకే మనం పుడమితల్లి బిడ్డలుగా ధనికులు ధనికులుగానూ, పేదలు కడు పెద్దలుగాను ఉంటున్నారు… ఇందులో ఒక పరమార్థం ఉంది. ఎవరో వస్తారని ఎదురుచూడడం మనం పునికి పుచ్చుకున్న దురలవాటు… అందుకే మేము సైతం అంటూ నూతన ఒరవడికి శ్రీకారం చు ట్టవలసిన తరుణం ఆసన్నమైంది. ఒక్కొక్క ఇటుకే మహా భవంతి అవుతుంది.. ఒక్కొక్క రాయి పెద్ద వంతెన అవుతుంది.. కనీసం మనవంతు గా మనోహరం, చర్చా వేదిక సమూహల్లో 282 మందిమి ఉన్నాము… ఒక సముచితవు ఆలోచన చేద్దాము. ఒక్కొక్కరు వంద రూపాయలు వేసుకున్నా 28 వేలు అవుతాయి. ఈ చెక్కును వ్యాక్షిన్ కోసం వినియోగించు కోవాలని సంబందికులకు అందిద్దాం. ఇలా ప్రతి ఒక్కరిలో ఓ ఆలోచనకు నాంది పలుకుదాం.. కొన్ని కోట్లమంది ఇలా సొమ్మును ప్రోగు చేసిన వందలు, వేల కోట్లు జమవుతాయి.. బడా బాబులు అప్పుడైనా కళ్ళు తెరుస్తారేమో.. ఓ. ఆశ. ఇలా అందరికి వ్యాక్షిన్ వేయించగలుగుతాము.. తారలు, హీరోలు స్పందించినా వ్యాక్షిన్ కి నిధులు సమకూరుతాయి… మీ లో ఒకరిగా… అంతులేని ఈ కథకు…. సుకాంతం.
ఇట్లు
మీ లో ఒకరు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!