అద్దె  ఇంటి కథ

అద్దె  ఇంటి కథ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎం. వి. ఉమాదేవి

   “అనుకుంటాం గానీ, అద్దె ఇల్లు అంత సుఖం లేదనుకో..! నెల చివరికి రెంట్ సిద్ధం చేస్కోడమే.. ఉన్న నాలుగో, రెండు గదులు మణిద్వీప వర్ణనలో అంత కాకున్నా నాల్గు ప్లాస్టిక్ పూల కుండీలు, టెర్రా కోట బొమ్మలు మూలల్లో మూల ఎందుకు అంటే, మధ్యలో పెడితే ఈ గడుగ్గాయి పిల్లలు ఇద్దరూ ఎంత సఖ్యo గా ఉన్నా, ఏదో క్షణం తిక్క రేగి కొట్టుకోవడం, దోసుకోడంతో ఇప్పటికి ఇరవై సెట్లు, టెర్రా కోట కుండీలు పగలేసారులే, అందుకే మూలపెట్టుకొని ఆనందం పొందొచ్చు, కిటికీ లోనుండీ వెన్నెలా వర్షం ఆస్వాదన గట్రా అసలుండవనుకో అటు ఇటు పోర్షన్ల రహస్యాలు మాత్రం గాలిలో గడుసు దెయ్యాలలా మనకి తెలుస్తయ్ ! నా వరకూ చూడు అప్రావ్ ! ఇల్లరికం అల్లుడా అనుకునేలా అత్తారింటిని వదలకుండా.. ఓ పదేళ్లు కాలక్షేపః అయినా.. మనకంటూ ఓ స్టేటస్ మెయింటేన్ చెయ్యాలనే జ్ఞానబీజం ఓ పూట మొలకెత్తగానే..అర్జెంట్ గా ఓ సండే ఆవిడ్ని వెంటేస్కుని పూర్తి టౌన్ తిరిగి వాకబు చేసినా ఒకటీ మంచి కొంపలేదు. చెప్తే నమ్మరు గానీ, మీరేమిట్లు అన్న ప్రశ్న దగ్గర నుండీ..గోల్డ్ ఎక్కడ దాస్తారు అనే వరకూ దండు పాళ్యం వాళ్ళలా దంచికొట్టే ప్రశ్నలూ పాడూ.! నోరు ఆరిపోయేది సాయంత్రం అయ్యేసరికి ! సూర్య  మాటలకి పకపకా నవ్వేడు అపరాజిత్. ఆఫీస్ లంచ్ అవర్లో బాక్స్ లోని అన్నం గభాలున తినేసి అరిగే వరకూ మాటలు ఇద్దరూ రోజు. ఈ రోజు టాపిక్ అద్దె ఇళ్ల గురించి. “తర్వాతేమయింది చెప్పు.! ఏమాయినా మా అత్తారింటికి అవతల వీధిలోనే టీచర్స్ ఇంట్లో ఒక పోర్షన్ ఉందని తెలిసి వెళ్ళాం. చాలా మర్యాద చేశారు. యజమాని తల్లిగారు మహా హుషారు మనిషి. డెబ్భై పైన వయసు పదహారేళ్ల మనసూ చేరండి అమ్మాయి. మాకో తోడు ఉంటుంది. మీ అమ్మ వాళ్ళు మాకూ తెలుసు.”అంటూ మా ఆవిడ్ని బాగా మెప్పించడంతో, ఇల్లు బొత్తిగా రైలు పెట్టెల్లా వరసాగ్గా, కట కటాల వరండా, హాలు, దేవుని గది, కిచెన్ అంతే.. ఉన్నా పెరట్లో బాత్ రూమ్ లు సెపరేట్, పూల మొక్కలు, బట్టలు ఆరేసే ప్లేస్ అన్నీ బాగానే ఉండడం తో ఇల్లు కడిగించి, పాలు పొంగించి మంచిరోజున చేరేం. పిల్లలు కూడ సరదా పడ్డారు. పాతిళ్లు, కొత్తిల్లు అని పేర్లు పెట్టుకోవడం కూడ వాళ్ళ మాటల్లో పిల్లల్ని బళ్ళో దింపి మేము జాబ్ కెళ్ళినా, సాయంత్రం వాళ్ళమ్మమ్మ ఇంటికే వెళ్లేవాళ్ళు. మేమొచ్చి ఇంట్లో పనులు వంట చూసుకోనీ లోపల వాళ్ళ తాతయ్యతో వచ్చేసే వాళ్ళు. అక్కడే స్నానం చేసేసి.. ఒకోసారి అన్నాలు కూడ తినేసి. ! అంటున్న సూర్యని అసూయ గా చూసాడు ఫ్రెండ్. అదృష్టం నీదేనోయ్ ! చూసుకోను  పెద్దాళ్ళున్నారు. మా వాళ్ళకి ఆ పల్లెటూరు వదలను ఇష్టం లేదు. నువ్వట్లా అనుకుంటే ఎలా? పీత కష్టాలు పీతవి. ఒకోసారి పిల్ల వెధవలిద్దరికి ఏమి తోచక, మేము రావడం కాస్త ఆలస్యం అయితే కొత్తింటికీ వచ్చేస్తున్నారు. మామ్మ గారితో మాట్లాడుతూ వాళ్ళ వరండాలో మకాం. వాళ్ళు భోజనం కోసం లోపలకెళ్తే వీళ్ళు వీధిలో కొచ్చేసి పెత్తనాలు, ఎవరో ఒకరిoట్లో టీవీ చూస్తూ. ఉంటే,  మేమొచ్చి వెతుకుంటూ ఉండాలి. కొన్నాళ్ళకి వేరే ఉన్నామని తెల్సిన చుట్టాలు శని ఆదివారాలల్లో వచ్చేది. రెండ్రోజులు ఉంటే ఇరుకిరుకై పోయేది కొంప. ఇలా కాదని, ఇంకా దగ్గరలో విశాలమైన పెద్ద ఇల్లు తీసుకున్నాం. అటాచ్ బాత్రూమ్ లు బాగానే ఉండేది. కానీ ఇరుగు పోరుగు వాళ్ళు మంచోళ్లు అయితేగా? పక్క పోర్షన్ ఆమె ఒకటే మాటలు మా ఆవిడతో. పగలూ రాత్రి లేకుండా. ఆదివారం కూడా  మాకసలు ప్రయివసీ లేకుండా పోయిందోయ్.!” కొందరంతే గురూ. మా సుధ ఏమో. అలా అనకండి వాళ్ళేదో కష్టం సుఖం చెప్పుకుంటారు. వినకుండా ఎలా ఉంటాం? పొద్దున్నే లేస్తే ముఖం చూసుకోవాలిగా.! అంటుంది. ఏమి కష్టం ? గుత్తివం కాయ్ లో పల్లీలు రుచా? నువ్వులు రుచా. గంట చెప్తుంది. వాళ్ళ తోటి కోడలి తమ్ముడు బామ్మర్ది వాళ్ళ గృహ ప్రవేశంలో తనకీ హేంత నాసి రకం చీర పెట్టారో చెప్పి తిట్టి పోయడం, వ్రతం లో పద్ధతి లేదనీ బోజనాలు సాయింత్రం నాలుక్కి పెట్టారని. ఇట్లా ఎన్నో చాడీలు ! ఈ లోగా మా వంటకాస్తా చల్లగా అయితినబుద్ధికాదు. ఇక ఇల్లు గల్లాయన కాస్త కృష్ణం రాజుగారి భారీ విగ్రహం, పెద్ద కళ్లు  వేసుకోని మూడో అంతస్తు పైనుండి అందరికి ప్రవేటు. చీటికి మాటికీ. గేట్ తీయరాదని, వాకిట్లో బట్టలు ఆ రేయరాదని సొల్లు! అన్నిటినీ మించి రెండో ఫ్లోర్ లో ఉన్న టీచరమ్మ గారు రాత్రి భోజనాలకి కూర్చున్న టైం లోనే ఎండుచేప గ్యాస్ స్టవ్ మీద కాలుస్తుంది. ఆ వాసనకి అన్ని పోర్షన్ల వాళ్ళు ఏడుపు తక్కువ. ఏంటమ్మా ఇది అంటే మాకది లేకుంటే తినలేం అలవాటు మార్చుకోవాలా మీ కోసం అని గొడవ ! యాక్ కష్టం గురూ ! ఆ ఫిష్ ఏదో కాస్త బాండీలో నూనె వేసి వేపుకు తినవచ్చుగా మిమ్మల్ని లా కాల్చుకు తినడమెందుకూ? అద్దె ముందే ఇచ్చేస్తారూ. అడపా దడపా పార్టీలు చేసి గిఫ్ట్ లిస్తారని వాళ్ళనేమి అనడు ఓనరు. సర్దుకు పోదాం రండీ అంటూ మాకే నీతులు. భలే వాళ్ళు కాదోయ్ సూర్యా! లోపల వాళ్ళకీ వాళ్ళకీ లింకులుంటాయి, ఫ్రెండ్ షిప్లో  టైటానిక్లా మునిగిపోయుంటారు. అందువల్ల మనం చేదు !”
హ. బాగా చెప్పావ్. ఓ రోజిదే మాట్లాడాలనీ మా యావిడ వెళ్ళిందటా ఓనరింటికి. వాకిట్లో ఉడకపెట్టిన కాకరకాయ ముక్కలు పళ్లెంలో వేసి ఎండలో పెట్టి కాపలా ఉందట ఓనరు వాళ్ళమ్మ. ఏవమ్మాయ్ యిల్లా వచ్చావ్ అన్న పలకరింపుకి , రెండో ఫ్లోర్ లో ఉన్న వాళ్ళ అరాచకత్వం గురించే చెప్పబోతుంటే. వాళ్ళుమంచి వాళ్ళనీ కాశీ వెళ్లి తనకీ రాగి చెంబూ, అసలు రుద్రాక్ష మాల, సంవత్సరానికి సరిపడే విభూతి తెచ్చేచ్చేరనీ వాళ్ళ ధాతృత్వం ఏకరువు పెట్టిందటా. ఇంకేంటి చెప్పేదని కాస్త కరివేపాకు అడిగి చక్కా వచ్చింది మా ఆవిడ !”చ్చో చ్చో ! అయితే ఎల్లా వదిలారు ఆ ఇల్లు? మేం సర్దుకుపోయినా మా చిన్నోడు భలే రోషగాడు చిరంజీవి స్టయిల్ అనుకో వాడన్నాడూ. ఈ బోడి ఇంట్లో ఇలాంటి ఇరుగూ పురుగూ ల తో కష్టం ఎందుకు. అర్జెంట్ గా మనమో ఇల్లు కొనేద్దాం. మనకి సొంత ఇల్లు లేదనేగా ఈ ఓనరు టెక్కు”అనీ..
దాంతో మా యావిడ హఠాత్ గా వీరావేశంతో జుట్టు పై పైన దువ్వుకుని, చెప్పు లేసుకొని “చూస్తారేం? బండి తీయండి. ఇల్లు చూసి వద్దాం ! అంటూనే చిన్న కొడుక్కో ముద్దిచ్చి మెటికలు విరిచింది. అన్నాలు పెట్టుకోనీ తినెయ్యండి అనేసి వెళ్లేముందు చెప్పేం. అవున్లే తిరగడం ఆలీసంగదా అమయినా దొరికిందా ఇల్లు. హప్పుడేనా అప్రావ్ ! ఆ విధంగా నాలుగు ఆదివారాలు తిరిగినా ఎవరు ఇల్లమ్మే వాళ్ళు దొరకడం లేదు. అంతలో మా మామ గారే దయతలచి ఒక రూమ్ మాకిచ్చి రక్షించేడు. వంట గది ఉమ్మడిగానే..అత్తయ్యె లాగూ వండిన కూరలు స్పెషల్ గా ఇస్తుంది. ఎలాగూ పగలు మేము ఉండమని తెలుసుగా. అలా అడ్జెస్ట్. నిట్టూర్చి లేచాడు సూర్యం. వీడో బంక వెధవ! ఏళ్ళ కేళ్లు ఆ అమాయక మామ గారికి చాకిరీ అప్పగించి అంతా అత్తవారి మీదనే ఖర్చులన్నీ !”అనుకొని పళ్ళు నూరుతూ సీట్లోకి వెళ్ళాడు అపరాజిత్ !!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!