ప్రేమతత్వం

ప్రేమతత్వం

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఐశ్వర్య రెడ్డి

ప్రేమ రెండక్షరాలే అయినా
గాలిలా ప్రతీచోటా వ్యాపించి ప్రపంచాన్ని నడిపిస్తూ
ప్రతి ఎదలో కొలువై ఉన్నది,
జీవితం విలువను చెప్పి
రేపటి వెలుగును చూపిస్తోంది .
మనుషుల మధ్య ఉన్న ప్రేమ
మానవతా విలువలు తెలిపితే,
వస్తువుల పై ఉన్న ప్రేమ డబ్బు
విలువనిచెబుతోంది .
అందం పై ఉన్న ప్రేమ ఆకర్షణీయతను పెంపొందిస్తే ,
ఆర్బాటాల పై ఉన్న ప్రేమ కృషితో అందలం ఎక్కిస్తుంది ,
కుటుంబం పై ఉన్న ప్రేమతోనే యజమాని త్యాగం,
పదవి మీద ఉన్న ప్రేమతోనే రాజకీయ దురందరుల విన్యాసం,
ప్రేమతోనే మన లక్ష్యం నిర్దేశించబడి
అహర్నిశలు కష్టపడి సాధించేలా చేసి
కొత్త గుర్తింపు తీసుకు వచ్చి విజయాన్ని చూపిస్తోంది,
ప్రతి విజయం ప్రేమ తోనే సాద్యం,
రేపటి ఆశల పూదోటలో
ఉదయించే సూర్యుడు కోసం ప్రతి ఒకరి తాపత్రయం,
సకల జీవరాశికి ప్రేమ అమృతమై,
ప్రేమతత్వాన్ని నింపి పయనింపజేస్తోంది
ప్రేమే కదా సృష్టి కి మూలం
ప్రేమే సర్వదా నిత్యనూతనం.

You May Also Like

2 thoughts on “ప్రేమతత్వం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!