టోపీ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: నెల్లుట్ల సునీత
తల మీద ధరించే శిరోధారణ
అలంకరణలో అందమై
నాగరికతకు చిహ్నమై
రాజసం వుట్టీ పడే అందం టోపిది
ఎండ నుంచి రక్షించే రక్షణ కవచం
నీడనిచ్చే చలువ నింబ వృక్షం
వైవిధ్య భరిత ఆకారాలలో లభ్యం
హోదాను తెలిపే అంతస్తు
హుందాతనానికి చిరునామా
సిపాయిల శిరస్త్రాణం
మ్యాజిక్ షోలలో మాయాజాలం
సర్కస్ లలో విన్యాసాల వైనం
మోసగింపులో కుచ్చుటోపి ఘనత
రాజకీయ మేధస్సుకి
రాజుల యశస్సు కి
అధికార దర్పణ కొలమానం
కార్యదక్షత ఖ్యాతిని పెంచే ఘన కీర్తి
గౌరవానికి టోపీ దిక్సూచి
శుభా శుభాలకు రూపమై
మత సంస్కృతులకు ప్రతి కై
పాశ్చాత్య ప్రాచీనమై
విలాసంలోనూ వినోదంలోనూ
అందరినీ ఆనందింపచేస్తూ
ఫ్యాషన్ కు ట్రెండ్ గా నిలిచింది టోపీ
గాంధీ టోపీ
నెహ్రూ టోపీ
జిన్నా టోపీ
ఇలా ఎన్నో….
మరాఠీ గుజరాతి
సంస్కృతులను ప్రతిబింబించే
మానవాళి మనుగడలో మమేకమైన
చారిత్రక చరిత్ర టోపీదే.