ఆశగా ఎదురు చూస్తున్న

ఆశగా ఎదురు చూస్తున్న

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బుదారపు లావణ్య

వెలుగు కన్నెత్తి అయినా
చూడని చీకటి గదిలో
ఒంటరితనపు పక్కమీద
నిద్ర పట్టక దొర్లుతూ
వేల కాంతుల సందడి తెచ్చే
నా బిడ్డల ఆప్యాయమైన
పిలుపు ఏనాటికైనా
నన్ను చేర పోతుందా అని
ఆశతో ఎదురు చూస్తూ
నానమ్మ అని ప్రేమగా పిలిచే
నా మనుమలు మనమరాళ్ల
తీయని స్వరం ఏనాటికైనా
నా చెవులారా వినకపోతానా అని
అనుక్షణం ఆలోచిస్తూ
నాలో నేనే అలమటిస్తున్నా
కలలు కన్నీరైపోయే
ఆశలు ఆవిరై పోయె
గుండె బరువెక్కి పోయె
కాటికి కాలు చాపిన వయసులో
కన్న బిడ్డల కోసం
అలమటిస్తూ.
చావు కూడా దరి చేరలేని
నిస్సహాయ స్థితిలో
నాలుగు గోడల మధ్య
కాలం వెళ్లబుచ్చుతూ
అందరూ ఉన్న ఏకాకినై
నాలో నేనే రోదిస్తూ
ఈ ఒంటరి గూడులో
నేనొక ఒంటరినై
అలమటిస్తున్నా
ఏనాటికైనా
ప్రేమ ఆప్యాయతలు పంచే
నా బిడ్డలకై
ఆశగా ఎదురు చూస్తూ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!