కృష్ణలీలలు 

కృష్ణలీలలు 

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నాగమయూరి

1.నంద నందనుని జననం
గోకులంలో ఆనంద సంబరం
నంద  కిషోరుని లీలలే
గోపాలుర మదికి సంబరం

2.ఆబాల కృష్ణునికే సొంతం
సుందరమైన  మురళీ గానం
ఆబాలగోపాలాన్ని సైతం
అలరించును ఆవేణుగానం

3.యశోదమ్మ ముద్దుబిడ్డగా
చిన్నారి కృష్ణుడు పెరిగెను
యశోవృద్ది నొందుచుండగా
గోకులము అంతా మురిసెను

4.కన్నయ్య బాల్యక్రీడలతో
మధురానగరి మురియంగా
కన్నవారికనులపంట
చిన్నారి పొన్నారి బాలలేగా

5.గోవర్ధన గిరిపూజతో
ప్రకృతిని ఆరాధించమన్నావు
గోవర్ధన గిరిధారివై
గోకులమును రక్షించియున్నావు

6.ఓ కాళీయ మర్దన కృష్ణా
ఆశ్రిత వత్సలుడా దేవదేవా
నీ కారుణ్య నయనములే
మాపాలిట వరములయ్య దేవా

7.సాందీప ముని ఆశ్రమాన
కుచేలుని చెలిమి పొందెను
సాందీపునికి దక్షిణగా
గురుపుత్రుని బ్రతికించెను

8.అష్ట ఐశ్వర్యములతోడ
తులతూగెటి వాడు శ్రీకృష్ణుడు
అష్ట మహిషులతడికి
రాధదేవికి అతడు ఇష్టుడు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!