అన్నదమ్ములు

అన్నదమ్ములు

-చెరుకు శైలజ

భారత్ రిటైర్ అయి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిన మొదలైంది. కొడుకులు విదేశాలలో వుంటు ఇద్దరు పిల్లలతో వాళ్ళు హాయి గా సెటిల్ అయిపోయారు. “నాన్న మీరు ఇక్కడకు వచ్చెయండి”. అక్కడ వున్న కుటుంబంలో వున్న అందరు రోజు ఫోను చేసి టికేట్ బుక్ చెయ్యాలా, అని అడుగుతునే వున్నారు. ఇప్పుడే వద్దు నేను చెపుతాను అని వాళ్లతో అనేవాడు.
“మీ వాలకం , నాకు అర్ధం కావడం లేదు”. పిల్లలు రమ్మని చెప్పు తు వుంటే, మీరు ఇంకా వాళ్ళను ఆగమని అనడం! ,నాకు ఇన్ని నాళ్ళ జీవితంలో ,ఈ ఇల్లు, ఈ వాతావరణం తప్పా ఇప్ప టికైన ,నాకు మార్పు వుండకూడదా? “ఇంకా చేతకాకుండ అయితే” అప్పుడు వెళ్లగలమా? “నాకు నా మనవాళ్లు మనవరాళ్లతో ఆడుకోవలి అని వుంది. భారత్ అనితతో.”నాకు తెలుసోయ్” ఈ లోపు ఒకసారి మన ఊరు వెళ్లి వస్తాను.
అక్కడ భూములు ఇల్లు వున్నాయి, చూసుకొని వస్తే బాగుంటుంది కదా, అని నా ఆలోచన. రేపు పొద్దున్నే బయలుదేరి రెండు రోజులకు వస్తాను. నేను మాత్రం ఇక్కడ వుండి ఏం చేస్తాను .నేను వస్తాను అంది . ఇద్దరు బయలుదేరీ కారులో ఊరు చేరారు. ఆ ఊరి చివరిలో పెద్ద బంగాళా వాళ్ళది .ఆ బంగాళలోకి అడుగు పెట్టగానే ఒకసారిగా ఏదొ తెలియని అనుభూతి భారత్కి అనిపించింది. ఇల్లంతా దుమ్ము ధూళి తో వుంది. మా చిన్నప్పుడు అయితే నాన్న గారు అమ్మ ఊరిలో ఉన్నప్పుడుడు ఆ వైభవమే వేరుగా వుండేది. పాడి పంటలతో ఎప్పుడు కళ కళ లాడుతూ వుండేది. నాన్నగారు కాలం చేశాక, అమ్మ ఒక్కతే ఊరిలో వుండి వ్యవసాయం చూసుకుంటువుండేది. మేము ముగ్గురం అన్నదమ్ములం .నేను చిన్న వాడిని. అందరం ఉద్యోగ రీత్యా సిటీ లో వుంటున్నాం. మా నాన్న గారు బతికి ఉన్నప్పుడే ఎవరి ఆస్తి వాళ్ళకి పంచేశారు.ఒక ఇల్లు మాత్రం ముగ్గురిని కలిసి వుండమన్నారు. అమ్మ నాన్న ఉన్నప్పుడు తరుచుగా వూరికి వెళ్లే వాళ్లం. లేకపోతే ఆయన ఊరుకునే వాడు కాదు.నేను ఉన్నప్పుడు వచ్చి చూసుకోపోతే, నేను పోయాక ఏం చూసుకుంటారు అని అనేవారు. మా పిల్లలు వాళ్ళ చదువులు వలన మేము ప్రతి సెలవులకి వెళ్లే వాళ్లం.మా ఇద్దరి అన్నయ్యల కన్న నేను ఎక్కువగా వెళుతుంటే వాడిని .ఆ ఊరు ఆ పొలాలు నాకు ఎక్కువ ఇష్టం గా వుండేది .మా అన్నలకి,వదినలకి పల్లెటూరు లో ఏం పొద్దు పోదు అంటు చికాకు చూపెట్టే వాళ్లు.ఏదైన అవసరానికి కారులో వచ్చి వెంటనే తిరుగు ప్రయాణం అయ్యె వాళ్ళు. నాన్న గారు వున్నప్పుడు కొంచెం భయంతో ఒకటి, రెండు రోజులు వుండేవాళ్ళు. ఆయన పోయాక అమ్మ ఎంత బతిమిలాడినా పనులు వున్నాయి. అంటు ప్రయాణం అయ్యేవాళ్ళు.నేను మాత్రం ఒక వారం రోజులు తృప్తి గా వుండేవాడిని.పిల్లలకి కూడా ఊరు సరదా కాబట్టి ఆడుతుపడుతు వుండేవాళ్ళు.
ఏం బాబు బాగున్నరా, అంటు తన పొలం కౌలుకు చేసె దానయ్య అడిగాడు. అవును దానయ్య .ఇల్లంతా దుమ్ము ధూళి తో వుంది .ఎవరైనా ఒక మనిషి దొరుకుతారా అంటు అడిగాడు ఎవరు ఎందుకు బాబు నేను నా భార్య కలిసి శుభ్రం చేస్తాం. కాసేపు మీరు ఆ పక్కనే కూర్చోండి. అంటు వైపు వెళుతున్న, ఒక ఆయనతో ఓ అయ్య కొంచెం మా ఇంటి దానిని ఒకసారి ఇడాకు రమ్మని చెప్పు. చాలా తొందరగా రమ్మను బాబు వాళ్ళు వచ్చిండ్రు అని చెప్పు అన్నాడు. అట్టానే అంటు ఆయన వెళ్ళిపోయాడు.దానయ్య దులపడం మొదలు పెట్టాడు. భార్య సత్యమ్మ వచ్చింది. ఇద్దరు కలిసి ఇల్లు అంతా శుభ్రం చేసి, అమ్మ వంట చేసుకోవాలి కదా, అని కూరగాయలు అన్ని కట్ చేసి మంచినీళ్లు పట్టి కూర్చుంది సత్యమ్మ. అనిత వంట చేసి వాళ్ళకు కూడా పెట్టి వాళ్ళు ఇద్దరు కూడా తిన్నారు. ఇద్దరు కొంచెం సేపు నడుము వల్చారు. దానయ్య ఇల్లంతా రిపేరు చేయించాలని వుంది. కాని పొత్తుల వ్యవహారం . మా అన్నలకు చెప్పితే ఊరిలో అంతా ఖర్చు పెట్టడం అవసరమా అంటారు. ఇల్లు పాడైపోతుంది అంటే చప్పుడు చేయరు .అవును బాబు మొదటి నుంచి మీకే ఈ ఇల్లు అమ్మ నాన్న అంటే ఎక్కువ .వాళ్ళు ఎప్పుడు పట్టించుకున్నారు కనుక అన్నాడు . పెద్ద పేరు వున్న బంగాగళనీ ,నాన్న పేరుని పాడు చెయ్యవద్దు అయ్య అంటు , పెద్ద అన్నకు పాలుకి దున్నే నర్సయ్య అన్నాడు .ఊరిలోకి భారత్ వచ్చాడు అని తెలిసి ఇంకా నాలుగు ఐదుగురు రైతులు వచ్చారు. మీరు ఈడకు వేస్తునే వుండాలి బాబు “మీలాంటి వాళ్ళు వస్తేనే మాకు ఊరిలో మంచిగా వుంటాది”.మా కడుపు నిండుతది అన్నాడు. ఒక పెద్ద రైతు పెద్ద అమ్మ ఉన్నప్పుడు అయితే
మాకు పండగే పిలిచి అన్నం పెట్టేవారు.అలా తలా ఒకమాట తో భరత్ని అక్కడే ఉండాలన్న ఆలోచనకు బలాన్ని ఇచ్చారు .మిగితా వాళ్ళు మల్ల రేపు కలుస్తాం అయ్య అంటు వెళ్లి పోయారు. దానయ్య నేను ఒకటీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఇంటి లో నా వాటా వస్తాది కదా, దానిని బాగు చేసుకొని ఇక్కడే వుందాం అనుకుంటున్నాను. ఇల్లంతా ఒక తీరుగా వుండదు కదా! బాబు అన్నాడు .మరి ఏం చేయాలి చెప్పు. నేను మొత్తం చేస్తే వాళ్లకి ఇష్టం వుండదు. పోని కలిసి చేద్దాం అంటే ఒప్పుకోరు‌. నా వాటా నేను చేసుకుంటే వాళ్ళ తో ఏం గొడవ వుండదు కదా! అన్నాడు. అప్పుడే ఇద్దరికి అన్నలకి ఫోను చేసి మాట్లాడాడు .నీ ఇష్టం చేసుకుంటే చేసుకోమన్నారు.వచ్చె వారం వస్తాం అన్నారు.
.రేపు వస్తాను బాబు అంటు దానయ్య వెళ్ళిపోయాడు.
ఏమండి,ఎంది మీరు చేసేది? అంది అనిత ఏం చేయాలి? నువ్వె చెప్పు. “ఊరిలోనే వుంటాను అంటున్నారు” . అక్కడ పిల్లలకు ఏమి సమాధానం చెప్పుతారు. పిల్లల దగ్గరకి వెళ్లి వచ్చి “మన చివరి మజిలీ ఇక్కడే గడుపుదాం” అన్నాడు. ఊరిలో వున్న ఆప్యాయతలు చూశావు కదా! ఇలాంటి ప్రేమలు, మనుషులు మనకు ఆ సిటీలో దొరుకుతాయా!
మనం ఈ కుడివవైపు వున్న ఒక గది, వంటగది అన్ని వసతులు వీలుగా చేసుకుందాం సరేనా అన్నాడు .మీ ఇష్టం అంది. ఇద్దరు ఆ భవంతిలో పక్కలు వేసుకొని నిద్ర లోకీ జారుకున్నారు. బాబు భారత్ , ఈ ఇంటిని మూడు పాళ్లు చేయకు, నేను తట్టుకోలేను. ఈ ఇంటిని వాటాలు వేసుకోకండి. ఈ ఊరిలో మీ పరువు కూడా కాపాడుకొండి. మీకు మీ ఇల్లులు వేరేగా వున్నాయి కదా! ఇంకా” మీ జ్ఞాపకలైన ఈ ఇంటిని విభజించకండి”. అంటు కండ్ల నీళ్ళు పెట్టుకొని తన వీపు పైన చెయ్యి వేసింది. తల్లి అరుంధతి. అమ్మ అంటు ఒకసారిగా ఉలిక్కి పడి నిద్ర నుండి లేచాడు.ఏమండి ,ఏమైంది? అంటు అనిత అడిగింది. ఏం లేదు అమ్మ కనిపించింది. ఇల్లుని పంచుకోకండి అని కళ్ల నీళ్లు పెట్టుకుని చెప్పింది అన్నాడు. అత్తయ్యా ఎంతో చేసింది. ఈ ఇంటికి పిల్లల విషయంలో నిజమే ఆ బాధ వుంటుంది కదా , అలాగే తల్లి గురించి మాట్లాడుకుంటు పడుకున్నారు.
తెల్లవారింది. దానయ్య సత్యమ్మ వచ్చారు . దానయ్య నేను ఈ ఇంటి మొత్తాని బాగు చేయించాలి. రాత్రి నిద్ర లో అమ్మ కనిపించి ఇంటిని విభజించవద్దు అని చెప్పింది. అన్నాడు అవునా!బాబు పెద్ద అమ్మ నిజమే చెప్పారు. కొన్ని రోజులు అక్కడే వుండి ఇల్లంతా బాగు చేయించాడు.
ఒక ఆదివారం అన్నలు వదినలు వచ్చారు.అంతా అందం గా వున్న ఇంటిని అలాగే చూస్తూ వుండిపొయారు. వాళ్ళతో జరిగిన దంతా చెప్పాడు. నా వాటా నేను బాగుచేసుకుంటా అని నేనే అన్నాను. ” క్షమించండి” మీరు కూడా దానికి సరే అన్నారు. అమ్మ చెప్పడం వలన ఈ ఇంటి విలువ తెలిసింది.ఇక ఈ ఇంటిని మనం పంచుకోవద్దు.
మనం చిన్నప్పుడు ఇక్కడే కలిసి పెరిగాం, కలిసాం ఆడుకున్నాం . ఇప్పుడు కూడ మనం ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఇక్కడే కలిసి వుందాం.
నేను మాత్రం ఇక్కడే వుంటాను. మీరు ఎప్పుడైనా రావచ్చు .ఏమంటారు అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పొలం పాళ్ళు చేసే మనుషులు ఎంత మంచిగా వున్నది.మాకు బాబులు మీరు ఇలాగే వుండాలి సంతోషంగా అన్నారు.
అన్నదమ్ములం ఒకరి చేయి ఒకరు పట్టుకొని వారివైపు చూసి నవ్వారు.ముగ్గురు తోటి కోడళ్ళు కూడా ఒకరి ఒకరు దగ్గరగా వచ్చి చేతులు పట్టుకున్నారు. మేము కూడా మీతోనే ఈ ఇంట్లోనే ఉంటాం. “మీరు మళ్లీ చిన్నప్పటి అన్నదమ్ములాగా కలిసి వుండండి”.మీ అమ్మ కోరికను నెరవెర్చండి”. అని ముగ్గురు తోటి కోడళ్ళు అన్నారు. మీ సహాకారం వుంటే అంతా కన్న కావాల్సింది. ఏముంది అంటు ముగ్గురు అన్నదమ్ములు వారి భార్యలతో కలిసి “భవంతిలో వున్న అమ్మా నాన్న ఫోటోకి నమస్కారం చేస్తూ,” అమ్మ ఇంకా ఎప్పుడు ఈ ఇంటిని విభజించం అని ప్రామిస్ చేస్తున్నాము” అన్నారు.అప్పుడే వీచిన గాలికి ఫోటో కదిలింది. వీళ్లను దీవించినట్లుగా……..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!