ఏది నిజం

ఏది నిజం

రచన:కాంతి శేఖర్. శలాక

ప్రకృతి నిజమా
దైవం నిజమా…

ప్రేమ నిజమా
వ్యామోహం నిజమా…

స్త్రీలను గౌరవిస్తే ఆ ఇల్లు దేవతల కొలువు అనే శాస్త్రం నిజమా
స్త్రీ కి స్వతంత్ర అర్హత లేదన్న అదే శాస్త్రం నిజమా…

పసిపిల్ల నుండి పండు ముసలి వరకు వదలని చిత్తకార్తే కుక్క మానవుల బుద్ధి నిజమా
ప్రకృతిలో పూర్ణమైన ప్రాణి మానవుడే అన్న విజ్ఞాన వాక్యం నిజమా…

చట్టం చేతులు చాలా పొడుగు అనే నానుడి నిజమా
దైవం వేసే శిక్ష చట్టం కన్నా వేగం అనే సిద్ధాంతం నిజమా…

స్వర్గం తల్లి పాదాల కింద ఉంటుందనే ధర్మం నిజమా
ఆడపిల్ల పుట్టింది మగవాడి కాళ్ళ కింద నలగటానికి అనే సమాజం వక్ర సందేశం నిజమా…
***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!