ఆవేదన
రచన: సుశీల రమేష్
స్రృష్టికి మూలం ఆడది అంటారు.
గుడిలో దేవత గా పూజిస్తారు.
అమ్మగా ఆరాధిస్తారు.
చెల్లి గా లాలిస్తారు.
ఆలీని సగ భాగం అంటారు.
తమ కూతురంటే
పంచ ప్రాణాలు
పరాయింటి ఆడపిల్లను
విషపు చూపు చూస్తారు.
చిన్న ప్రాణినైన నాదో విన్నపం
దేవుడా నన్ను ఈ మగ రక్కసుల
రాజ్యంలో పుట్టించకు
అమ్మ కడుపు లోనే సమాధి
చేసేయండి ఆడపిల్లగా
పుట్టి బయటకు వెళ్లి
తిరిగి క్షేమంగా వస్తానో
లేదో అని అనుక్షణం నా
తల్లిదండ్రులు పడే ఆవేదనను
నేను భరించలేను.
***