నేటి గురువు

నేటి గురువు

రచన: కార్తీక్ దుబ్బాక

 

గురువు దైవం, పూజింపబడినాడు.
గురువు స్థానం ఉన్నత మైంది
ఒకనాడు.
గురువు సాక్సాత్తు పరభ్రహ్మ
వేదలానాడు

సమాజ రూపకర్తలు అన్నారు
బడిలో లేకుండా పనులెన్నో
చేయిస్తున్నారు..
సమాజ నిర్దేశకులు అన్నారు
నిబ్బరమే లేని స్థానం కల్పించారు.

అన్నీ పనులు చేసే కూలివాడు, అయినాడు
పిల్లలకు, పెద్దలకు పెద్ద పనివాడు
అన్నిశాఖల విధులు నిర్వహణ
సేవకుడు

కుటుంబాన్నివదిలిన, సమాజ సేవకుడు
ప్రతి నిత్యం ఏదో పనిలో నిష్ఠుడై
పాఠాలు మరిచాడు
అనేక భయాల పాఠశాల నిర్వహనుడు

పని వత్తిడికి నలుగుతున్న బానిస గురువు
సమాజ గుర్తింపు లేని, జాడలేని గురువు

పేరుకే ఉన్నత స్థానం
ఉత్త స్థానమై నిలిచింది నేడు
గురుస్థానంమరిచింది సమాజం
గురువులు జీరోలు నేడు…….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!