కనిపించవా ఓసారి

(అంశం: “ఏడ తానున్నాడో”)

కనిపించవా ఓసారి

రచన: యువశ్రీ బీర

ఎంతకీ అంతుచిక్కని ప్రశ్న ఒకటి…
నా ఎదలో గూడుకట్టుకొని, సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు…
సందేహాల సంకెళ్లు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి…
ఏమిటా ప్రశ్నలు, ఏమిటా సందేహాలు అంటారా…

అదే నేనూ ఆలోచిస్తున్నా…
సృష్టికి ఆయనే కర్తంటారు….
ఆయనే అన్నీ అంటారు…
కష్టమొస్తే ఆయన్నే వేడుకుంటారు…
నష్టమొస్తే, లాభాలనివ్వమని ప్రార్ధిస్తారు…
సంతోషంలో అంతా ఆయన కృపాకటాక్షాలే అంటారు…
కోర్కెల ముడుపులతో ఆశల ముడులువేస్తూ…

ఎన్నెన్నో బంధాలను
బాధ్యతలుగావేస్తూ…
ఆప్యాయతల తీగలల్లుతూ…
కష్టాల నావలను మెల్లిగా దాటిస్తూ…
అనురాగాల పూలను పూయిస్తూ…
మమతలగూడు కట్టుకునేలా చేస్తాడట…
కానీ కంటికిమాత్రం కనపడడట…
ఏడ తానున్నాడో కనబడితే చాలు…
ఒక్కసారి కళ్లారా చూసి, బంధాలకు అనురాగపు గొడుగుపట్టి…
బాధ్యతగా మనుషులను నడిపించమని కోరతా…?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!