రేడియో

అంశం: నేనో వస్తువును

రేడియో
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సావిత్రి కోవూరు

ఏళ్లుగా మీ మానసికోల్లాసాన్ని చేకూరుస్తు,
నా రూపం తగ్గించి, తీగలన్ని తీసేసి,
పెట్టె లాంటి నా రూపాన్ని అరచేతిలో ఇమిడేల మారాను.
‘వందేమాతరం’ అంటూ మేల్కొల్పి,
సుప్రభాతాది భక్తి గీతాలతో మిమ్మల్నలరించి,
ప్రపంచ వార్తలతో పలుకరించి,
సంగీత పాఠాలెన్నో నేర్పి,
కార్మికుల కార్యక్రమంలో, కబుర్లెన్నో చెప్పాను.
స్త్రీల కార్యక్రమాలతో పలకరించి
యువజన కార్యక్రమాలతో యువతను ఉత్సాహపరిచాను.
పాడి పంటల ముచ్చట్లతో రైతన్నలకు కొత్త పద్దతులు తెలుపాను,
శనాది వారాలు చిట్టి పొట్టి పాటలతో,
బుజ్జి బుజ్జి మాటలతో,
బాలానంద కార్యక్రమాలతో మీ పిల్లల మురిపించాను
మీ పేరు ఊరును తెలుపుతూ ‘మీరు కోరిన పాటల’తో అలరించాను,
నాటికలు, రూపకాలు, సంక్షిప్త శబ్ద చిత్రాలతో ఎంతో కాలక్షేపం అయ్యాను,
జనగణమనతో సెలవు తీసుకునే నన్ను, మిమ్ము బద్ధకస్తుల చేసే,
నా తమ్ముడు రంగులపెట్టె రాకతో నన్నటకెక్కించుట న్యాయమా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!