నేటి కాలము
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: సుజాత కోకిల
అమ్మ ఒక సృష్టి. ఒక శక్తి తన శక్తియుక్తులతో ఇంటిని తన కర్తవ్యంగా భావించి పని చేస్తుంది. తన బాధ్యతలను ఒడుదుడుకులను దాటుకుంటూ నావకు తెడ్డులా పనిచేస్తుంది. అమ్మ ? అమ్మే లేకుంటే, ఆ ఇల్లే చీకటి ఇంటికి దీపము ఇల్లాలు. ఆ ఇంటికి దీపం ఉంటేనే ఆ ఇల్లు ఆనందంగా కళకళలాడుతుoది. అలాగే ఇంటి బాధ్యతలు మోసే నాన్న కూడా ఒక నావలాంటి వాడు, తను కష్టపడి ఇంటి బాధ్యతలను మోస్తాడు. తన భార్య బాధ్యతల్లో తను సగభాగం పంచుకుంటూ, ఇంటి పరువు , ప్రతిష్టలను కాపాడుతూ, భార్యకు తోడు నీడగా ఉంటూ. తన కర్తవ్య నిర్వహణలో పిల్లలు కూడా ఒక బాధ్యతగా భావించి పిల్లలు ఒక ఉన్నత స్థాయికి చేరుకోవాలని తండ్రి పడే ఆవేదన మాటల్లో చెప్పలేం. నావను నడిపించేవాడు నావికుడు. ఆ నాన్న ఉంటేనే జీవితం ముందకు సాగుతుంది.
మనసు పడే ఆవేదన మనకు స్థిరాస్తులున్నా, లేకున్నా కష్టపడి బతుకు బండిని సాగించేవాడే ఉన్నతుడు. పిల్లల ఆనందాలెే మనకు వెలుగు, నీడలు పిల్లలు మన కనుసైగల్లో ఉంటూ మనం చేసే పనుల్లో సహాయంగా ఉంటూ బాధ్యతల్లో పాలుపంచుకుంటూ ఉంటే మన ఆనందాలకు కొదువ లేదు అప్పుడు ఒకే పడవపై ప్రయాణం చేసిన భయం లేదు. ఇప్పుడు ఉండే కుటుంబాలు వేరు ఎవరికి వారే యమునా తీరే ఇంట్లో అందరూ ఉన్నా ఎవరున్నారో లేరో అన్నది తెలియని దుస్థితి. ఒకే గూటిలో ఉన్న ఎవరితో ఎవరు మాట్లాడరు ఎవరి పనిలో వాళ్లు లీనమైపోతారు. పిల్లల అయితే మరీను పిల్లలకు ఇంట్లో సెల్ఫోన్ల ఉంటే చాలు, బయట ప్రపంచమే తెలియదు. ఇంటికి బంధువులు వచ్చినా హాయ్. అంటూ వెళ్లిపోతారు. పిల్లల ఆలనాపాలనా కూడా సరిగా చూడరు ఉద్యోగాలంటూ వెళ్లిపోతారు. కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు ప్రేమలు పెరుగుతాయి బంధాలు తెలుస్తాయి. ఒకరి కష్టాలలో ఒకరు పాలు పంచుకుంటూ, ఔన్నత్యాన్ని చాటుకుంటూ, నలుగురికి చేదోడు, వాదోడుగా ఉంటేనే కుటుంబాలు బాగుంటాయి. మన ముందు తరాల వారికి కుటుంబాల విలువ సాంప్రదాయల విలువ తెలుస్తాయి. రొటీన్ జీవితం గడుపుతూ డబ్బే ప్రపంచం అనుకుంటే జీవితమే కాదు పరుగెత్తెే జీవితంలో సంతోషం తృప్తి ఉండదు. మన ముందు తరాల భవిష్యత్తును ఆలోచించి వారానికి రెండు రోజులైన పిల్లలతో సంతోషంగా గడపాలి. మన అనుభవాలు మన సాంప్రదాయాలు అప్పటి ఆటపాటల గురించి పిల్లలకి బోధించాలి. మంచి చెడ్డల గురించి వివరిస్తూ నైతిక విలువల గురించి చెప్పాలి. భవిష్యత్తులో ఎలా ఉండాలో తెలియచేయాలి. మనం కష్టపడే విధానం చెప్పాలి. మనం ఎంత కష్టపడితే ఈ స్థితికి వచ్చాము అన్నది చెప్పాలి. అప్పుడే మనం బాగుంటాం మనభావి తరాల వారు బావుంటారు. జీవితం నేర్చుకునే గుణపాఠం జీవితం నేర్పిన సత్యం ఇలాగే ఉంటే మన ముందు తరాల వారికి ఏం తెలియకుండా పోతాయి. పాలించేవాడు సరిగా ఉంటేనే పరిపాలన బాగుంటుంది. అందులో ఉండే ప్రజలు బాగుంటారు. ఏ నిమిషంలోనైన రాజు అప్రమత్తంగా ఉంటే రాజ్యమే పోతుంది. అందులో ఉన్న ప్రజలు దీనావస్థలో ఉంటారు. ఎవరిది లోపం రాజుది రాజుతో ఉన్న ప్రజలది. ప్రతి ఒక్కరికి మంచి ఆలోచన ఉండాలి. మన అనే భావన కలిగి ఉండాలి. ప్రజల కోసమే, ప్రజలకై బ్రతుకుతున్న రాజుది ఎంత గొప్ప బాధ్యత ఉండాలో అంతే గొప్ప బాధ్యత ప్రజలకు కూడా ఉండాలి. ఇంటిని నడిపే ఇంటి యజమాని ఎంత బాధ్యత వహించాలో అంతే బాధ్యత రాజు కూడా అంతే బాధ్యత వహించాలి. అప్పుడే కుటుంబాలు, రాజ్యాలు బాగుంటాయి.