చెట్టు యొక్క గొప్పతనం 

చెట్టు యొక్క గొప్పతనం 

రచన :: ఎన్.రాజేష్

ఏనాడైనా తెలుకున్నావా చెట్టు యొక్క గొప్పతనం..
నువ్వు ఏనాడైనా గ్రహించావా ఆ చెట్టు గురించి ఒక్క క్షణం?

రహదారికి అడ్డు ఉన్నదని
దాని అడ్డు తొలగిద్దాం అనుకున్నావు..
కానీ ఆ రహదారి వెంట నీడ పంచును అనే విషయాన్ని మర్చిపోయావు..

చిన్న విత్తనం వేసి మొక్కగా పెంచితే.. శాకోపాశాకలుగా
విస్తరించి అది చెట్టయి నిలబడింది.

నువ్వు అడగకుండగనే నీవు కర్మాగారల వెంట వెదజల్లే విష వాయువును పీల్చుకుని
నీవు బతకడానికి ప్రాణ వాయువుని అందించింది.
కూరగాయలను పంచింది,
పండు ఫలమును ఇచ్చింది.

అలసిన నీ శరీరానికి నిలువ నీడ అయింది.,
ఎండలో గొడుగు అయింది,
వచ్చే వర్షానికి అడ్డుగా తెరను పంచింది.

ఇన్ని చేసిన చెట్టును నీవు నరికివేసినా నీకు కలప రూపంలో ఆదుకుంది.
ఆది నుండి తుద వరకు నీకు ఉపయోగపడుతూనే ఉంది.

ఓ కనికరం లేని మనిషి
ఇకనైనా గ్రహించుకో..
చెట్టే మనిషికి జీవన
ఆధారం అని.,
ఓ సానుభూతి లేని మనిషి
ఇకనుండైనా తెలుసుకో..
చెట్టు లేకుండా నీ బతుకు కొనసాగించుకోలేవని!

తెలుసుకో చెట్టు లేకుండా మనం జీవించలేమని..!
తెలిసి మసలుకో చెట్టు లేకుండా మన జీవితం
కొనసాగించుకోలేమని..!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!