గణితం నా ప్రియనేస్తం

గణితం నా ప్రియనేస్తం

రచన :: ఎన్.ధన లక్ష్మి

నన్ను నాకే కొత్తగా పరిచయం చేసి..’
నాలో పట్టుదలను నింపి…
నాలో దాగి ఉన్న ప్రతిభను తెలిపి
నాకంటూ ఓక గుర్తింపు తెచ్చి న  నా భాగ్యస్వామివి !!

సంతోషం వచ్చిన బాధ ఎక్కువయినా
పంచుకునే నా మొదటి చెలిమివి
నమ్మకాన్ని కోల్పయిన ప్రతిసారి
నాకు దారి చూపిన నా వారధివి …

కొత్తగా సరికొత్తగా ఎప్పటికపుడు
నిన్ను నువ్వు మార్చుకో అని
నిత్యం పాఠం నేర్పే నా గురువువి
కింద పడ్డ ప్రతిసారి  నిలపడి పోరాడు
నీకంటూ ఒక విలువ ఉంది అని
నాకు మార్గం చూపిన నా మార్గదర్శివి …

నాకు ఎదురయినా ప్రతి ప్రశ్నకు
జవాబు చూపిన నా ప్రియానేస్తమివి.. కష్టంగా  మొదలయైన  మన స్నేహం
ఇష్టసఖిగా మారినతరుణం !!!
నా  ఆనందాన్ని  పెంచుతూ  !!!➕
నా  బాధాన్ని  తగ్గిస్తూ   ➖
నా విజయాన్ని రెట్టింపు చేస్తూ ❌
నా విద్యను నలుగురికి పంచుతూ ..➗
నాకు ఇష్టసఖి గా మారిన  గణితం.   వెయ్యివందనాలు నీకు

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!