స్నేహబలం

స్నేహబలం

రచన: జయ

ఒక అడవిలో మర్రి చెట్టు తొర్ర లో  ఒక ఎలుక,ఉడుత, ఒక గ్రద్ద  నివసిస్తూ ఉండేవి.
అవి వాటి పిల్లలతో ఆ చెట్టు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ, వాటికి దొరికిన ఆహారం తెచ్చుకొని
పిల్లలకి పెట్టుకుంటూ ఉండేవి.
కాలం గడిచే కొద్దీ  ఎలుక, ఉడుత మధ్య స్నేహం పెరిగి, ఒకే మాట మీదా నడుచుకునేవి.
ఒక రోజు ఎలుక , ఉడుత ఒకే సారి ఆహారం కోసం బయటకు వెళ్లాయి.
అప్పుడు ఒక పాము ఎలుక పిల్లల కోసం చెట్టు తొర్ర లోకి ప్రవేశించింది.
ఎలుక పిల్లలు పాము ని చూసిన భయం తో అరవడం  మొదలు పెట్టాయి.
అప్పుడే ఆ చెట్టు పై వాలిన గ్రద్ద  ఆ అరుపులు విని ఎందుకు అలా అరుస్తున్నాయి చూద్దాం అని చెట్టు తొర్రలోకి తొంగి చూస్తే అక్కడ పామును చూసి అయ్యో వీటి తల్లి ఎక్కడకు వెళ్లింది అనుకోని.
పాపం ఇప్పుడు ఇవి ఈ పాము కి ఆహారం కాబోతున్నాయి.
వీటిని ఎలా అయినా రక్షించాలి అని వాటి తల్లి కి చెబుదాము అని చూస్తుంది.
అది ఎక్కడ కనిపించకపోయే సరికి,లాభం లేదు
తల్లి కోసం చూస్తే పిల్లలు బలి అవుతాయి.
నేనే ఏదో ఒకటి చేసి ఆ పిల్లల్ని రక్షించాలి అనుకోని.
ఆ చెట్టు తొర్రలో ఉన్నా పిల్లల కోసం వెళ్లిన పాము పై పొట్లాటకు దిగుతోంది.
గ్రద్ద దాడి కి తట్టుకోలేక పాము అక్కడి నుండి పారిపోతుంది.
అప్పుడే అక్కడి కి వచ్చిన ఉడుత, ఎలుక కూడా గ్రద్ద చూసి, తమ పిల్లలని రక్షించిన తీరుకు ఆశ్చర్య పోయి చూస్తూ ఉండిపోయి.
కాసేపటికి తేరుకొని గ్రద్ద చేసిన సహాయానికి కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకుని.
ఇన్ని రోజులుగా గ్రద్దను అనుమానించినందుకు సిగ్గుపడుతూ మమ్మల్నిి క్షమించు అని అడుగుతాయి.
అప్పుడు గ్రద్ద మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. మీరు నన్ను అనుమానించడంలో తప్పు లేదు. ఎందుకు అంటే గ్రద్ద అంటేనే భక్షించు పక్షి , మీరు భయపడటం లో తప్పు లేదు. కావున మీరు నాకు కృతజ్ఞత కానీ,క్షమాపణ కానీ చెప్పనవసరం లేదు.
కానీ నాకు ఒక సహాయం చేయండి చాలు.
గ్రద్ద మాటలకి ఆశ్చర్య పోయి.
ఏమిటి చెప్పు అని అడుగుతాయి.
అది నాకు మీ ఇద్దరి స్నేహం చాలా బా నచ్చింది.
మీ స్నేహం నేను చాలా రోజులు నుంచి చూస్తున్న.
నాకు కూడా మీతో స్నేహం చేసే అవకాశం ఇస్తారా. మీతో పాటు నేను కూడా ఇక్కడే వుంటున్న కదా,మీరు లేని సమయంలో మీ పిల్లలకు తోడుగా ఉంటా, నేను లేనప్పుడు మీరు నా పిల్లల ను చూసుకోండి.అని అడుగుతుంది.
గ్రద్ద మాటలు నమ్మిన ఉడుత, ఎలుక రెండు కూడా గ్రద్ద ను తమ జట్టులో చేర్చుకున్నాయి.
ఆ రోజు నుంచి మూడు చాలా స్నేహం గా ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ.
తము సంపాదించిన ఆహారం జాగ్రత్తగా భద్ర పరుచుకుంటూ.
ఆహారం దొరకని సమయంలో నిల్వ చేసుకున్న ఆహారం తింటూ సంతోషం గా గడుపుతున్నాయి.
ఇలా ఉంటూ ఉండగా వాతావరణం లో మార్పులు వచ్చాయి వాతావరణం మబ్బు పట్టి ముసురు పట్టింది.
మూడు ఒక చోట కలసి చూడండి మిత్రులారా
ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుంది. ఈ సమయంలో మనం నిల్వ చేసుకున్న ఆహారం తీసుకుంటూ మన పిల్లలకి పెట్టుకుంటూ ఈ సమయంలో మనం మన పిల్లలు ను జాగ్రత్తగా చూసుకోవాలి అనుకోని, అలాగే జీవితాన్ని గడుపుతున్నాయి.
ఇలా ఉండగా ఒక రోజు ఒక పిల్లి గాయాలతో చెట్టు నీడలో ఏడుస్తూ ఉండటం చూసి,ఈ మూడు జాలి పడి, పిల్లిని చెట్టు తొర్రలోకి తీసుకువెళ్లి దాని గాయం మానే వరకు జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు దాచుకున్న దానిలోనే పిల్లికి పెడుతున్నాయి.
కొన్ని రోజులుకి పిల్లి కి నయం అయ్యి పిల్లి వీటి దగ్గరకు వచ్చి నన్ను జాగ్రత్తగా చూసుకున్నదుకు కృతజ్ఞతలు తెలుపుతూ వెళ్లి వస్తాను అని చెబుతుంది.
ఆ రోజు కొంచెం వాతావరణం బాగుంది సరికి పిల్లిని ఈ రోజు మా పిల్లలు కు తోడు వుండు మేము ఆహారం సంపాదించుకొని వాస్తము అని కోరగా పిల్లి సరే అని సంభరపడుతుంది.
పిల్లి కుట్ర గమనించని ఈ మూడు బయటకు వెళ్లిపోతాయి పిల్లిని నమ్మి.

సాయంత్రానికి చెట్టు దగ్గరికి చేరుకున్న మూడు అక్కడ తమ పిల్లల అస్థిపంజరాలు చూసి ఏడుస్తూ పిల్లిని నమ్మినదుకు ఇంత మోసం చేసింది అనుకోని పిల్లికి బుద్ది చెప్పాలి అనుకోని.
పిల్లి కోసం కాపు కాసి ఎలుకను బురధలోకి దించి, ఉడుత, గ్రద్ద దాకోని చూస్తున్నాయి.
అటుగా వచ్చిన పిల్లి ఎలుకను చూసి అబ్బా ఈ పిల్లి కూడా నా చేతికి చిక్కింది.
ఇదే ఈ రోజు నాకు తిండి అనుకోని.
ఎలుక దగ్గరకీ వస్తుంది. ఎలుక పిల్లిని చూసి దయచేసి నన్ను కాపాడు నేస్తం అని అడుగుతుంది.ఎలుక మాటలకి పిల్లి నవ్వి పిచ్చి ఎలుక ఇంత అమాయకురాలివి. నీవు నీ పిల్లకి లాగే చేస్తున్నావ్ అని ఎలుక దగ్గరికి వెళ్లబోతుంటే వెనుక నుంచి గ్రద్ద వచ్చి పిల్లిని బురదలోకి తీసేసి ఎలుకను కాపడతాయి.
అప్పుడు ఈ మూడు ఒక చోట చేరి పకపకా నవ్వుతాయి.
పిల్లి పరిస్థితి పిల్లి కాపడమనే అరుపులు విని నీకు ఇదే తగిన శాస్తి అని వెళ్లిపోతాయి.
పిల్లి ఆ బురధలోనే మునిగి చనిపోతుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!