సైన్స్ లో దాగివున్న నిజం

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

సైన్స్ లో దాగివున్న నిజం

రచయిత :: పావని చిలుమేరు

రామయ్య  కష్టపడి సాగు చేసే ఒక మోతుబరి రైతు. కాని జాతకాల మీద,  మూఢనమ్మకాల మీద చాలా నమ్మకం.

వ్యవసాయం అంటే  అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది యెప్పుడు అనుకొనే వాడు.అందుకే యేదో ఒక విషయం పైనా తనకు ఎంత అదృష్టం ఉందని పరిక్షించుకునే వాడు రామయ్య .

తన పొలం పక్కనే ఉన్న గంగయ్య పొలం మీద యెప్పుడు కన్ను వేసేవాడు  యెందుకు అతని పంట యెప్పుడూ పచ్చగా ఉంటుందని ఈర్ష్య పడేవాడు.
కాని గంగయ్య చాలా మంచి వాడు కష్టాన్ని నమ్ముకునే వాడు. గంగయ్య యింటిలో  అందరూ కలిసి ఆడుతు పాడుతూ  కష్టపడి పనిచేసేవారు.

ఒక రోజు రామయ్య,  గంగయ్య 3 నెలలుగా చాలా కష్టపడి పండిన పంటను కుప్పలు పెట్టి ఇంటికి వచ్చారు . గంగయ్య పొలం పక్కన పంపుసెట్టు దగ్గర కుప్పలు పెట్టాడు.
కాని రామయ్య కరెంట్ వైర్ల దగ్గర పెట్టాడు.

యింటికి వెళ్లి 3 నెలల కష్టం ఇంకా వారంలో అమ్మి సొమ్ము చేసుకోవచ్చు అనుకోని సంతోషంగా అన్నం  తింటూ  రామయ్య మనవడి తో  యీ పండక్కి  నీకు మంచి బట్టలు కొంటాను అని చెప్పి పడుకొన్నాడు.
బాగా పని చేసి ఉండడం వల్ల బాగా నిద్ర పట్టింది రామయ్య కి. కొంత సేపు తరువాత రామయ్య పంట మొత్తం మంటలు అంటుకున్నాయి .

పంట కాలుతున్న  వాసనకి మెలుకువ వచ్చి పొలం వైపు వురికారు ఆ  పల్లే జనం.
అక్కడికి వెళ్లి చూసేసరికి ఒక్క రామయ్య పంట కుప్పలకు తప్ప, ఇంకా పక్కన ఉన్న  దేనికి కూడా మంటకి అంటుకోలేదు .
అది చూసి పల్లే జనం అంతా వనికి పోయి అమ్మో యిది దయ్యం పనే అని పారిపోయారు.

రామయ్య కూడా యిది దయ్యం పనే అనుకొని మూఢనమ్మకం తో మంత్రగాడి దగ్గరకు వెళ్లి  3 నెలలు కష్టపడ్డ పంట చేతికి అందే సమయంలో  దయ్యం యిలా  చేసింది అని చెప్పి చాలా బాధ పడ్డాడు.
కాని రామయ్య మనవడు యిది దయ్యం పని కాదు అని ఎంత చెప్పినా వినిపించూకోలేదు .

అప్పటి నుంచి పల్లే జనం  వూరిలో దయ్యం వుందని పొలాల్లో నుంచి తొందరగా వచ్చి  అన్నం తిని తొందరగా పడుకునేవారు .

తరువాత రోజు మంత్రగాడు రామయ్య పొలం కి వచ్చి పూజలు చేసి పొలం చుట్టూ పసుపు, కుంకుమ చల్లి , బియ్యం పిండితో చుట్ట ఒక గీత  గీసి  ఇంకా దయ్యం నీ పంట లోపలికి రాదు అని చెప్పి నువ్వు, నేను ఒక వారం యిక్కడే పడుకుందాo దయ్యం రాగానే నేను దానిని బంధించి  పాతి పెడతా అని మంత్రగాడు రామయ్య కి చెప్పాడు.
పల్లే జనం కూడా  అది నమ్మి, దయ్యంని యెప్పుడు బంధించి వుంచుతారు అని యెదురు చూస్తున్నారు.

ఇంకా రోజు రాత్రి ఒక లాంతరు,కర్ర పట్టుకొని పొలంలోనే పడుకునే వారు.

మూడు రోజుల తరువాత ఒకరోజు రాత్రి యేదో కదులుతూ ఉన్నట్టు కనిపించింది.
మొదట  రామయ్య భయపడి పక్కకు తిరిగి గట్టిగా కళ్లు మూసుకున్నాడు . కొద్ది సేపు తరువాత కళ్లు తెరిచి చూడగానే ఆ పక్క కూడా యేదో కదులుతూ ఉన్నట్టు అనిపించింది.
అంతే మంత్రగాడు లేవడo మంత్రాలు చదవడం అన్ని చక చక జరిగిపోతున్నాయి .
అంతలోనే రామయ్య కర్ర తీసుకుని పక్కనే ఉన్న అరటి చెట్ల వద్ద దయ్యం వుందని బాగా కొట్టి కొట్టి అరటి చెట్లు మొత్తం నాశనం చేశాడు.

మంత్రగాడు మంత్రాలు ఆపివేసి రామయ్య తో నీ దెబ్బ కి దయ్యం పారిపోయిoది అని నమ్మ బలికించాడు.
ఆ రాత్రి రామయ్య అదే పొలంలో హాయిగా పడుకొన్నాడు.

తెల్లవారుజామున లేచి పల్లే కి  వచ్చి దయ్యం రాత్రి ఎంత పని చేసింది అని పల్లే లో అందరికీ చెప్పడం మొదలు పెట్టాడు  రామయ్య.
కాని రామయ్య మనవాడు మాత్రం యిది దయ్యం పని కాదు అని మళ్ళీ అరవటం మొదలు పెట్టాడు.
రామయ్య కి చాలా కోపం వచ్చింది.
రా వచ్చి చూడు పట్నం లో ఉండే మీకు వీటి గురించి యేమీ తెలుసు అని యిష్టo వచ్చినట్టు అరిచి,  కోపంతో చేయి పట్టుకొని  దయ్యం పనులు యేల ఉంటాయో చూపిస్తాను పద అని మనవడి నీ పొలంకి లాక్కోని పోయాడు.
పల్లే జనం కూడా రామయ్య తో పాటు పొలం కి వెళ్ళాడు.
పొలం కి చేరగానే అరటి చెట్లు మొత్తం చిందరవందరగా విరిగి పోయి ఉన్నాయి.
చూసావా నా అరటి తోట మొత్తం దయ్యం యేల పాడుచేసిoదో అని రాత్రి జరిగిన విషయం అంతా చెప్పాడు.

మనవాడు మళ్ళీ యిది దయ్యం పని కాదు అని వాదించాడు ,
యిది అంత నీ చేతులరా నువ్వే పాడు చేశావు అని రామయ్యతో పల్లే జనం తో చెప్పాడు.

రామయ్య మనవాడు పల్లే జనంతో యిలా చెప్పాడు.
మొన్న జరిగిన మంటలు మీరు దయ్యం అంటున్నారు నేనూ కాదు అంటున్నాను .
మొన్న మంటలకి కారణం కరెంట్ వైర్ దగ్గర కుప్పలు పెట్టడం వల్ల  కరెంట్ షాట్ సర్క్యూట్ జరగవచ్చు, లేదా ఆకాశం లో వచ్చిన మెరుపు వల్ల వచ్చే కరెంట్ తో మంటలు  అంటుకోవచ్చు.
యిది అంత సైన్స్ ,కాని మూడ నమ్మకం కాదు, దయ్యం కాదు.

అలాగే రాత్రి జరిగింది నీ తప్పు అంతె  ,దయ్యం వస్తది అని యెదురు చూస్తూ వున్నారు కాబట్టి మీకు గాలికి వూగిన.అరటి చెట్లు కూడా దయ్యం లాగా కనిపించి నీ చేతితో మొత్తం నాశనం చేశావు అని రామయ్య కి పల్లే జనం కి వివరించి చెప్పాడు రామయ్య మనవుడు .

అవును అదే నిజం దయ్యం లేదు యేమీ లేదు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!