తరువు

తరువు

రచన :: బండి చందు

ఒకనాటి అర్ధరాత్రి
మూడవ జాముఘడియ
మా ఇంటిముందరి మాను
తాళి లేని ఆళిలా నన్ను
గుచ్చి గుచ్చి చూస్తుంది
తలలేని మొండమై వెక్కిరిస్తుంది
తన కొమ్మరెమ్మలు దూరమై
కోపంతో క్షణక్షణం విలపిస్తుంటే
కొండంత ఆశతో మానవత్వం లేని
మనిషి మరల మరలా శాసిస్తుంటే
దిక్కుతోచని దిశకు వాయువు
వీయాల్సిన దుస్థితి ఏర్పడిందని
తనలో తాను కుమిలిపోయి
తన తనువునే తాకట్టు పెట్టిన
త్యాగమయి నా తరువు…

You May Also Like

One thought on “తరువు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!