ఎడారి జీవితం

ఎడారి జీవితం

రచయిత :: పి. వి. యన్. కృష్ణవేణి

పార్థసారథి ఒక మంచి  సైంటిస్ట్.  మంచి అనే కంటే పేరుపొందిన అంటే బాగుంటుందేమో!!!!

ఆ పేరు పెట్టుకున్నందుకు పార్థుడు అంటే పట్టుదల,  సారధి లేకుండానే నడిపించగల సామర్ధ్యం రెండూ కలిసి ఉంటాడు.

అక్కడ ఆ పార్ధుడికి శ్రీకృష్ణుని తోడుగా ఉంటే,  ఇక్కడ ఈ పార్ధుడికి తన మరదలు వైష్ణవి తోడుగా ఉంటుంది.

ఇంకా మన కథ లోకి వచ్చేసరికి, ఈ పార్ధు,  ఎడారి గురించి పరిశోధనల నిమిత్తం, ఎడారి ప్రాంతమైన సహారా దగ్గరలోనే … ఒక ఊరిలో నివాసానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

ఈరోజు రాత్రి ప్రయాణం కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా తినడానికి, ఉండడానికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు.

అన్నీ గమనిస్తున్న వైష్ణవి కూడా అతనితో వెళ్లడానికి నిశ్చయించుకుంది. ఆ విషయం తెలియని పార్ధు మాత్రం ఒంటరిగా ప్రయాణం అనే ఆలోచిస్తున్నాడు.

చివరి నిమిషంలో వచ్చి కారులో కూర్చుంది వైష్ణవి. తన  లగేజీ తో సహా.  నువ్వెక్కడికి… అసలే అది ఎడారి ప్రాంతం.

అక్కడ మనుషులు ఎలా ఉంటారో తెలియదు.  పైగా ఆడపిల్లవి  నేనయితే ఎలాగున్నా సర్దుబాటు చేసుకుని రాగలను అంటూ మందలించాడు.

ఏంటి పార్ధూ, నువ్వు  కూడా  ఆడ పిల్లనని విడదీసి  చూడటం అంటూ చిన్నబుచ్చుకున్నది. అయినా నిన్ను విడిచి ఎప్పుడన్నా  ఉన్నానా!!! అంటూ బుంగ మూతి  పెట్టింది.

ముసిముసిగా నవ్వుకుంటూ,  మహాతల్లి సరే పదా,  నువ్వు నన్ను వదలవుగా అంటూ కారు ముందుకు పోనిచ్చాడు.

ఒక రాత్రి అంతా ప్రయాణం చేసిన తర్వాత,  ఉదయం వారు చేరవలసిన ప్రాంతానికి చేరుకున్నారు.

ఉదయం ఎనిమిది గంటలకు,  అక్కడ వాతావరణం 12 గంటలు అయినటువంటి మిట్టమధ్యాహ్నం లాగా ఏండ దంచేస్తోంది.

తెచ్చుకుని నీళ్లలో ఒక బాటిల్ కాళీ చేసేశారు.  అలాగే చుట్టూ ఎవరైనా  ఉన్నారేమో అంటూ పరికించి చూశారు.  అక్కడ వాళ్ళ గురించి.  ఎడారి ప్రాంతాల్లో జనాభా,  మన ప్రాంతాలతో పోల్చుకుంటే చాలా తక్కువనే చెప్పాలి.

ఉండటానికి సౌకర్యాలు  లేక పోవటం వల్ల కావచ్చు,  నీటి కొరత కావచ్చు,  జీవనోపాధి సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు.  మొత్తానికి చాలా పలచగా జనాలు ఉన్నారు.

వాళ్లు ముందుగానే మాట్లాడుకున్న ఒక చిన్న పాటి ఇంటిలో దిగారు.  కానీ వాళ్లకు నచ్చిన విషయం ఏమిటంటే –  ఇంత ఎండలో కూడా వాతావరణం వారికి నచ్చుతుంది .

పొడి ఇసుకలో వాళ్ళు ఆడుతుంటే, చేతికి అంటలేదు. జలజల రాలే జలపాతం చేతిలో నుంచి ఆ ఇసుక జారి పోతుంటే,  చిన్న పిల్లల్లాగా కొంతసేపు గడిపి తరువాత స్నానం చేసి ఫ్రెష్ అయ్యారు.

స్నానానికి కూడా చాలా తక్కువ నీళ్ళతో కానించేసారు.  అక్కడ ఇంకొక వింత ఏమిటంటే,  స్నానం చేసిన  నీళ్ళు కూడా వాళ్లు కళ్లు తెరిచి చూస్తే, అంతలోనే  ఇంకి పోవడం.

అది గమనించిన వైష్ణవి, పార్ధూ నేను ఎక్కడో చదివాను…  ఎవరన్నా టాయిలెట్ పోస్తున్నా సరే, ఆ వాసన వారి ముక్కుకు తగిలే లోపమే టాయిలెట్ ఇంకి పోతుందట.  కనీసం ఆ మరక కూడా కనిపించదట. చాలా వింతగా అనిపించింది నాకు అంది.

అవునా నీకు చాలా విషయాలు తెలుసు.  కానీ ఆ విషయం మనం ఇందాక  ఆ ఇసుక లో  చిన్న పిల్లల్లాగా ఆడక  ముందు చెప్పాలి నువ్వు. అంటూ నవ్వాడు.

ఏం కాదులే పార్ధూ. ఇక్కడ రోగాలు కూడా చాలా తక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అధికంగా ఉష్ణోగ్రత నమోదు అవడం వల్ల కావచ్చు అంది.

వైష్ణవి,  నువ్వు నిజంగా ఇంజనీరింగ్ చేస్తున్నావా!!! ఇలాంటి సైన్స్ విషయాలు నీకు ఎలా తెలుస్తున్నాయి?  అంటూ అనుమానంగా చూసాడు పార్ధూ.

ఏదో నాకు తెలిసిన పుస్తక పరిజ్ఞానాన్ని చెబుతున్నాను బాబు  అంది నాటకీయంగా.

నువ్వు చెప్పిన వాటిలో సగం వరకు కరెక్ట్. కానీ, ఆ ఉష్ణోగ్రతల వల్ల ఇంకా ఎక్కువ లాభం చేకూరడం కోసమే నేను ఇక్కడ వరకు వచ్చాను.

అంతే కాకుండా రోగాలు వ్యాప్తి చెందకపోవడానికి కారణం మాత్రమే,  కాదు మనం నాగ జముడు,  బ్రహ్మజెముడు అని పిలుచుకునే, ఆ మొక్కల యొక్క జిగురుని ఔషదం లో ఉపయోగిస్తూ ఉంటారు. ఆ మొక్కలు ఈ ఇసుక నేలల్లో ఎక్కువుగా ఉంటాయి. ఆ మొక్కల నుండీ వీచే ఆ గాలి, ఆ ఎడారి పుష్పాల వంటి ఆ మొక్కల గుణాలు చాలా  వరకు రోగాలను అరికడతాయి. వాటికి నీరు కూడా చాలా తక్కువ మోతాదులో సరిపోతాయి అంటూ వివరించాడు.

అలా మాట్లాడుకుంటూ వాళ్ళు తెచ్చుకున్న టిఫెన్ తిన్నారు.

వాళ్లు మాటల్లో ఉండగానే, వాళ్ళు టిఫిన్ ఆరగించడం చూసి,  పెద్ద అమ్మాయి, ఒక చిన్న పిల్లవాడిని వెంటబెట్టుకుని, ఎమైనా తినడానికి వచ్చింది.

వాళ్ల వేషభాషల్లో తేడాలేదు. కానీ తిండి తిని చాలా రోజులైంది, చాలా  నీరసంగా కనిపించారు ఇద్దరూ.

మా దగ్గర ఉన్న వాటిల్లో,  కొంచెం ఆహారం తీసి,  వారికి కూడా ఇచ్చాము. వారి కళ్ళలో ఆనందం ఆ తల్లిలో మానసిక ప్రశాంతత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

టిఫిన్ తిన్న తర్వాత ఆ ప్లేట్లు తీసి, గ్లాసులు కడగడం లాంటి పనులు చేస్తున్నది.

నాకు అక్కడ ఎవరూ తెలియదు కాబట్టి, వారిని మాతోపాటు వాళ్ళు ఒకటి అయిపోయారు.

నాకు అర్థమైంది ఒకటే.  ఏ ఊరు అయినా, ఏ  భాష అయినా తల్లిప్రేమ, ఆకలికి భేదం తెలియదు. ఇప్పుడు ఈ తల్లికి మాత్రమే చేయూతను అందించగలిగాను.

ఇక్కడ పరిస్థితిని నాకు అనుగుణంగా చేసుకోవాలి. ఇక్కడ అందరికీ ఎంతో కొంత న్యాయం చేయాలి.  ఆపదలు రాకుండా కాపాడుకోవాలంటే, నేను ఎంతో శ్రమ  తీసుకోవాల్సి వస్తుంది అని నిర్ణయం తీసుకున్నాడు పార్ధు.

ఆ తల్లి సహాయంతోనే , దగ్గర్లో తిరగడానికి ఒక ఎడారి ఓడ అని పిలుచుకునే,  ఒక మంచి ఒంటెను తీసుకున్నాడు.

ఆ అరుదైన సూర్యరశ్మితో, అత్యంత ఉష్ణోగ్రతతో విద్యుత్ ,  సోలార్ పవర్, వైద్య వృత్తికి మూలికలు సేకరణ వంటి ఎన్నో ఆశయాలతో ఇక్కడ అడుగు పెట్టారు.

ఆ సైంటిస్ట్ తెలివికి, ఓ ఇంజనీర్ బుర్ర తోడు ఉంది. ఇంకా ఓటమి అనే పదానికి తావు లేదు.

విజయం మా సొంతం అంటూ ఆ ఎడారి ఓడ పై, ఎడారిలో ప్రయాణం మొదలుపెట్టారు. వెనుక నుంచీ వీళ్ళ గెలుపుని కోరుకునే, రెండు ఆపన్న హస్తాలు వీరికి ఆశీర్వదించగా, ఆ అమ్మ వీళ్ళ విజయం కోరుతుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!