మానవత్వం పరిమళించిన వేళ

(అంశం : “మానవత్వం”)

మానవత్వం పరిమళించిన వేళ

రచన: డి.స్రవంతి

 

అమ్మ..నేను స్కూల్ కు వెళ్ళను…అంటూ తన పదేళ్ల కూతురు … మమత మారం చేస్తుంటే.. అది కాదు తల్లి! బడికి వెళ్లి మంచిగా చదువుకొని ఉద్యోగం చేసుకోవాలి బిడ్డ …మాలాగా రోజు కూలీ పనికి వెళ్తే ఏమొస్తుంది….

మీ అయ్యా నీ చిన్ననాడే కాలం చేసిండు..
మనవి పనికి వెళ్తే గాని పూటగడవని బతుకులు… పొట్ట చేత పట్టి,కూలీ నాలి చేసుకుంటూ నిన్ను సాకుతున్న…
నువ్వేనా.. చదువుకుని ఈ కూలీ పనులు చేసుకోకుండా సుఖంగా జీవించు అన్న తల్లి మాటలకు.. మమత మనసులో ఏదో సాధించాలి అన్న కోరిక కలిగింది..
పని కోసం ఆ ఊరు ఈ ఊరు తిరిగేవాళ్ళం అని మమతను ప్రభుత్వ హాస్టల్ లో జాయిన్ చేసింది తల్లి.
ఆ పసి హృదయం తల్లి ఎడబాటుని తట్టుకోలేక విలవిల ఏడ్చింది.
కానీ తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి తన తల్లి ఆవేదన అర్థం అయింది కన్నీటినీ దిగమింగి హాస్టల్ లో ఉండిపోయింది.
కొత్త వాతావరణం కొత్త స్నేహితులు కొత్త పాఠశాలలో బెరుకు బెరుకుగా, భయంగా తనలో తానే రోదిస్తూ చదువుకోవాలనే పట్టుదల తో మమత హాస్టల్ లో ఉంది..
రోజు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటూ టీచర్లు చెప్పిన అన్ని విషయాలు తూచా తప్పకుండా నేర్చుకున్నది. టీచర్లందరినీ మన్ననలు పొందింది.
దసరా సెలవులకు అందరూ పాఠశాలలను విడిచి తమ ఇళ్లకు వెళ్లారు
పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి.. టీచర్ పిల్లలు మీరు సెలవులలో ఎంజాయ్ చేశారా! .
అయితే అందరూ ఎవరెవరు ఏమి చేశారు చెప్పండి అని టీచరు అడిగిన ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పలేదు
మమత నేను చెబుతాను అంటూ… టీచర్ మీరు పాఠ్యాంశంలో మానవత్వం అంటే ఏంటో మానవత్వపు విలువలు ఏంటో వివరించారు కదా! నేను అర్థం చేసుకున్నాను .
ఏంటి మమత ఏం చెప్తున్నావు పిల్లలు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పమ్మా
టీచర్
సెలవులలో మా ఇంటి పక్కన ఉన్న తాతకి ఎవరు లేరు .నేను ప్రతిరోజు అన్నం వండి పెట్టడం, తనకు కావలసినటువంటి సహాయం చేయడం, కూరగాయలు, పండ్లు ఇచ్చి తాతకు సహాయ పడ్డాను అంది మమత.
అందుకు టీచర్ చాలా సంతోషించి పిల్లలు చూశారా… మమత పాఠంలోని మానవత్వం గురించి తెలుసుకొని తను ఎదుటివారికి సహాయపడింది. పాఠంలోని అర్థాన్ని గ్రహించింది నిజజీవితానికి వర్తింపజేసింది..అంటూ. అందరూ చప్పట్లతో మమతను ప్రశంసించారు.

మమత ఇంత చిన్నతనంలోనే చెప్పిన విషయాలను ఆచరణలో చూపించావు, నీవు గొప్ప స్థాయికి ఎదుగుతావు అని..టీచర్ మమతను అభినందించారు..

మానవత్వం మనిషి గుణాల్లో కాకుండా చేతల్లో చూపిస్తే కొందరి జీవితాల్లో చిరునవ్వుల వెలుగు పువ్వులు వికసిస్తాయి..

You May Also Like

One thought on “మానవత్వం పరిమళించిన వేళ

  1. సూపర్ అండీ.. ఉపయోగం. ఇలాంటి రచన లు స్ఫూర్తి దాయకం.. ధన్యవాదములు స్రవంతి గారు.. 👌👌👍👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!