మానవత్వం

(అంశం : “మానవత్వం”)

మానవత్వం

రచన: పుల్లూరి సాయిప్రియ

ఒక పిల్లవాడు ప్రతిరోజు స్కూల్ కి వెళ్ళేవాడు. రోజు స్కూల్లో టీచర్లు చెప్పె విషయాలను ఇంటికి వచ్చి వాళ్ళ తాత కి చెప్పేవాడు. అలా ఓ రోజు స్కూల్ కి వెళ్ళి వచ్చిన ఆ పిల్లవాడు వాళ్ళ తాత దగ్గరికి వచ్చి తాత నిన్ను ఒకటి అడుగుతాను నాకు సమాదానం చెప్తావా అని అడిగాడు,అప్పుడు ఆ తాత సరే చెప్తాను ఎంటో అది అని అడిగాడు. అప్పుడు ఆ పిల్లవాడు, తాత మా స్కూల్లో మా టీచర్ మానవత్వం గురించి చెప్పారు. నాకు ఏమి అర్థం కాలేదు తాత అసలు ఆ మానవత్వం అంటె ఏంటి తాత అని అడిగాడు. అప్పుడు ఆ తాత దానికి సమాదానంగా, బాబు ఎన్ని రోజులయిందో ఆ మాట విని ఇప్పుడు ఆ మాట వినగానే నా చెవులకి ఎంత వినసొంపుగా ఉందో..సరే చెప్తాను విను బాబు, మన కళ్ల ముందు ఏదైన అన్యాయం జరిగిన, ఎవరైన తప్పు చేసిన, అది ఏదైన కావచ్చు న్యాయం కానిది ఏది జరిగిన దాన్ని అడ్డుకొని న్యాయం జరిగేలా చెయ్యాలి. అదే “మానవత్వం”. బాబు. అని చెప్పాడు. అప్పుడు బాధగా
ఆ తాత బాబుతో, బాబు ఇప్పుడు మానవుడిలో ఏలాంటి మానవత్వం లేదు. మానవత్వం అనేది ఇప్పుడు శిథిలావస్థమయింది బాబు. అని చెప్పాడు.
చూసార.. ప్రస్తుతం మన సమాజ పరిస్తితి ఇలానే ఉంది. మనం కూడ మన భవిష్యత్ తరాలకు అప్పట్లో “మానవత్వం” అనేది ఒకటి ఉండే అని చెప్పుకునే పరిస్థితులు వస్తాయేమో అని అనిపిస్తుంది.
###

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!