జీవితం ఒక సవాల్

జీవితం ఒక సవాల్..?

రచన: వి.కృష్ణవేణి

ప్రపంచంలో జీవమనుగడ ఒకపెద్ద సవాల్.
మనిషి ప్రాథమికఅవసరాలు నుండి
మాధ్యమికఅవసరాలవరకు ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొనక తప్పదు..
విద్యాపరంగా,సమాజ గౌరవపరంగా
సామాజికవిలువలను పొందేతరుణంలోనూ..
ఎన్నో అవాంతరాలు ఎదుర్కుంటూ ముందుకు సాగేప్రయత్నంలో ఎన్నోసవాళ్లు ఎదురవుతూఉంటాయి..
వ్యాపారరీత్యా,ఉద్యోగరీత్యా..
మనుషుల మధ్యసంబంధాలతో నెట్టుకుని  రావాలంటే ఆర్ధిక పరంగా…
మానసికపరంగా,నైతికంగా,సామాజికంగా…
ఎంతోకొంత అభివృద్ధిచెందుతూ
ఎదురయ్యే సమస్యలను అధికమించే  మనోథైర్యాన్ని కల్గి మునుముందుకు
అభివృద్ధిని సాధించే ప్రయత్నం చేయాలి.
పెరుగుతున్న అవసరాలు,
తరిగిపోతున్న వనరులు,
చాలిచాలని జీతాలతో జీవితాన్ని
నెట్టుకురావాలంటే అదొక పెద్ద సవాల్..
సరైన ఆశయం ఉండాలి దానిని సాధించడానికి సక్రమమార్గం ఎంచుకోవాలి. అదే జీవితాన్ని ఉన్నతి స్థానానికి తీసుకెళ్తుంది.
ఉన్నస్థానం నుంచి ఉన్నతి స్థానానికి ఎదగాలి..
అందుకోసం, నిరంతర కృషి..
లక్ష్యం సాధించాలనే దృఢసంకల్పం
ఎంతోఅవసరం..
ఉన్నవిలువలను కాపాడుకుంటూ…
ప్రకృతి సహజసంపదను వినియోగించుకుంటూ
నేటి అవసరాల ఆవశ్యకతను తెలుసుకుని
ఎంతోకొంత సర్దుబాటుతనాన్ని అలవర్చుకుంటూ
తోటివారికి సహాయం సహకారాలు అందిస్తూ మానవతాధర్మాన్ని పాటిస్తూ
జీవితమనేది ఒక సవాల్ మాత్రమేకాదు
సమాజ శ్రేయసుకు మనము బాధ్యులమే.
సమాజాన్ని సన్మార్గంలో నడిపించి
దానిలో మనకు ఉన్న హక్కుపూర్తిగ సద్వినియోగం చేసుకుని మంచి పౌరునిగా సమాజంలో మెలగడం కూడా ఒక సవాల్..
మన నడవడిక నలుగురికి ఆదర్శంగా ఉండాలి
తరువాత తరానికి మార్గదర్శిగా మిగలాలి.
చిన్నచిన్న తప్పిదాలు కూడా  జీవితాన్నే కాదు సమాజం మొత్తంపై దాని ప్రభావం చూపును..
కావున ప్రతీచిన్న విషయాలలో కూడా ఆచిచూసి మెలగడం జీవితానికి మరొక పెద్ద సవాల్..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!