జాలి లేదా

అంశం: నేనో వస్తువుని

జాలి లేదా
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సుజాత కోకిల

నేను ఒక మనిషినెే నా మోములో
చిరునవ్వు ఉండాలని కోరుకోవడం
నా తప్పేమీ కాదెే మీలా నేను ఆడదాన్నెే
ఆటవస్తువును కాదుఎక్కడైనా
పడేయడానికి నేనొక జీవం లెేని
మనిషిని కాదు నాకు ఒక మనసుంది.
ఆ బాధ తెలుస్తుంది.ఆడిందల్లా
ఆడడానికి నేనేమీ బంతిని కాదు
కోరికలంటూ నాకు ఉంటాయి .
నేనెంత మీ మేలు కోరుకున్న
పడేయాలనెే చూస్తూ తొక్కేస్తున్నారు.
చక్కగా అలంకరించుకోవాలని,
నా భర్తతో ఆనందంగా బ్రతకాలని,
నా భర్త గుండెల్లో గువ్వలా ఒదిగిపోవాలనే
కోరిక నాకు ఉంటుంది ఎందుకని,
నన్ను విడదీయాలని చూస్తున్నారు.
నువ్వు కూడా ఒక ఆడదానివే కదా!
నాలా ఓ ఇంటి నుండి వచ్చిందానీవే కదా !
నీకు భర్త ఉన్నాడు
నువ్వు కాపురం చేస్తున్నావు?
నీకు లేని శిక్ష నాకెందుకు ?
నేనేం పాపం చేశానని?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!