ఎదో అలా క్రేజీగా నవ్వడం

ఎదో అలా క్రేజీగా నవ్వడం

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎన్.ధన లక్ష్మి

నవ్వుతూ ఉండడం ఇష్టం…
ఎందుకో తెలుసా…..
మనసు తేలిక పడుతుందని
ఎదో తెలియని సంతోషం వస్తుందని

నవ్వించడం చాలా ఇష్టం ….
ఎందుకో తెలుసా….
మన వారి పెదాలపై వచ్చే ఆ చిరునవ్వు..
మనకు ఎదో తెలియని అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుందని.

స్నేహితులను ఏడిపించడం మరింత ఇష్టం
వారు అలా ముద్దుగా ఏడుస్తుంటే
ఎదో తెలియని సంతోషం మనసుకి
మళ్ళీ క్రేజీ గా నేనే నవ్వించడం మరెంతో ఇష్టం

గిఫ్ లతో కొట్టుకోవడం ఇంకెంతో ఇష్టం
నువ్వు, నేనా అంటు మురిపెంగా కొట్టుకోవడం
చెప్పుకోలేనంతగా ఇష్టం
అమ్మ తో వాదించడం ఇష్టం
అమ్మ తో చివాట్లు తినడం ఇంకెంతో ఇష్టం

అన్ని క్రేజీ గా చేయడం ఇష్టం
బాధల్ని లోపల దాచడం మరింత ఇష్టం
వాటిని కనపడకుండా నవ్వుతూ బ్రతికేయడం ఇంకెంతో ఇష్టం

తెలియని నేర్చుకోవడం ఇష్టం…
నేర్చుకునేవి ఎదుటివారిపై ప్రయోగించడం చాలా ఇష్టం
నిద్ర లేకుండా ఉండడం ఇష్టం…
కలత నిద్రలతో ఫ్రెండ్స్ ని డిస్టర్బ్ చేసి ఏడిపించడం ఇంకెంతో ఇష్టం

ఎన్ని వచ్చిన నవ్వుతూ,నవ్విస్తూ ఉండడం ఇష్టం
అలాగే నవ్వుతూ జీవితాన్ని గడిపేయడం మరెంతో ఇష్టం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!