నీతో నేను

అంశం::(“ఊహలు గుసగుసలాడే”)

నీతో నేను

రచన: విజయ మలవతు

కంటి చూపున చిక్కుకున్న నీ రూపం పదిలం
పెదవి అంచున దాచుకున్న నీ పేరు ప్రియం
వేళ్ల చివర ముడుచుకున్న నీ స్పర్శ సుకృతం
పాదంతో పంచుకున్న నీ అడుగుజాడ జ్ఞాపకం

నా కంటి చివరలలో దాపెట్టిన కన్నీటి చెలమలు కరగనివే
నా మునిపంటి అంచులలో నొక్కిపెట్టిన బాధలు మరువనివే
వేళ్ల కొసలలో చెరిగిపోయిన జ్ఞాపకాల తడి తీరనిదే

ఊహాలోకంలో విహరింపజేస్తూ
పక్కనుండి గుసగుసలాడుతున్నట్లుగా
భ్రమపెట్టి మనసుని నిధురపుచ్చుతూ
అలసట తెలియనీకుండా ఓదారుస్తున్నావే
నీకిది న్యాయమా ప్రియతమా…!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!