దయా గుణం

దయా గుణం

రచన: గాజులనరసింహ

తెల్లారే పొద్దుల  శుభ్రభాత గీతాలాలాపనలు వినిపిస్తూ ఉన్నాయి .కిచ్ కిచ్ రావాలతో పక్షులు తమ గూళ్లను వీడి ఎగిరిపోతున్నాయి . ఆ సమయంలో యాచకుడు

“” చన్నీటి చుక్కల కళ్ళాపి చల్లి ముందట్ల ముంగిట్ల ముగ్గులు వేసి ముస్తాబు అవుతుంది సూడర సామీ…

కోడికూయ్యంగ లేచి ఇల్లు ఇడుపంతా ఉర్చంగ ముద్దు ముచ్చట్లు పరుపుల మూటగట్టి ముస్తాబు అవుతుంది సూడర సామీ ..రారోరి రారోరిరో..నా సామి శ్రీరంగ రారోరిరో….””

అంటూ ఆగమనం చేస్తాడు .అపుడు పల్లె ప్రజలంతా లేచి తమ వీధుల్లో   తమ ఇళ్లముందు కసుఊర్చి నీళ్లు చళ్ళు కొని ముగ్గులు వేసుకుంటూ వుంటారు .పల్లె ప్రజల తీరు హడావిడిగా ఉంటుంది త్వరగా వంటలు చేసుకొని పనులకు వెళ్లాలనే ఆత్రుత ..కొందరి ఇల్లల్లో  కొరత బాధలు ఉంటాయి కొందరికి సంతోషాలు సంపదులు ఉంటాయి ..

“”అనగనగా..ఒక ఊళ్ళో… అందని తాటి చెట్టు ఒకటుంద0టా.. దానికి ఒక తొట్టి ఉందంటా “” ఒక ఇంట్లో  పొద్దున్నే పిల్లలకు  సోమయాజి అను ముసలాయన కథ చెబుతువున్నాడు .ఆ సందర్భ0లో ఇంట్లో  నుంచి గడబిడా అంటూ గిన్నెలు నేల పడిన శబ్దం ఉస్తుంది  అపుడు  కథ వింటున్న పిల్లలు అది విని “” తాత… లోపల గిన్నెలు  కింద పడ్డట్టున్నాయి .శబ్దం వస్తుంది ..”” అని పిల్లలు అనగా.. సోమయాజి  “” అహ్హహా అహ్హహా.. అని నవ్వి …అవి ఇపుడే కాదు నా పెళ్లి అయినప్పటి నుండి పడుతూనే ఉన్నాయి .. నేను కొన్నవన్ని లోకులు పడిపోయాయి  అప్పటినుంచి నేను కొనడం మానేసాను ..అవి మీ అవ్వే..తన  పుట్టింటిను0చి తెచ్చుకొంది .పోతే మల్ల ఆమెనే తెచ్చుకొంటుందిలే ..అని అంటాడు. అపుడు పిల్లలు “” తాత అవ్వ అంత కోపంతో విసుక్కుంటుంది కదా..నీకు కోపరాదా.” అని అంటారు

అందుకు ఒక చిన్న కథ ఇలా చెబుతాడు “” ఒకనాడు
ఉరిలోకి వచ్చిన యాచకుడు ఇల్లిల్లు బిచ్చం ఆడుకుంటూ వస్తూ ఉంటాడు ..అలా వస్తు  వస్తూ.. ఈ సోమయాజి ఇంటికి వస్తాడు .వచ్చి ఇంటిముందు నిలబడి “” అమ్మా.. అమ్మా.. ఇంత బిచ్చ0 ఏయ్ తల్లి””

అంటూ రెండు మూడు సారులు అంటాడు .అపుడు ఈ సోమయాజి భార్య చిరాకుతో కోపంగా ఉంది కదా..అదేపరాకుతో ..లోపలి నుంచే  “”ఏయ్..ఏమి లేదుపో.. పనిలేదు పాటలేదు పొద్దు పొద్దున్నే తగలబడతావ్  ..పో పోవయ్యా.. పో అంటూ కసురుకుంటుంది .బిచ్చం ఒకరు వేస్తారు ఒకరు ఇలాగే లేదని చెబుతారు ..అపుడు అతను   అక్కడినుండి వెళ్ళిపోతాడు ..

అది పల్లెటూరు కదా.. అందరూ పొలం పనులకు వెళ్తూ వుంటారు .ఈ సోమయాజి తన భార్యకుడా పనికి పోతూ వుంటారు వాళ్ళది బీదకుంభమే  ..

యాచకుడు   అందరూ పొలం వెళ్లే దారిలోనే ఓ చెట్టు కింద కూర్చోని ఉంటాడు  .ఇతని దురదృష్టం ఏమిటంటే.. ఆ రోజు ఎవ్వరూ ఇంత అన్నం పెట్టలేదు .గింజలు పెట్టారు కానీ తనకు వొండుకొనే0దుకు వీలు లేదు ఏకాకి తను కాబట్టి.

సమయం 10 గంటలు అయ్యింది తనకు ఆకలి అవుతుంది తట్టుకోలేక పక్కనే పారుతన్నకాలువలో నీళ్లు తాగుతూ ఉంటాడు ..ఆ మార్గం గుండా వస్తున్న  సోమయాజి తన భార్య ఇది గమనించారు .. అపుడు వాళ్ళు ఆ యాచకుని దగ్గరికి
వెళ్లి

“” రేయ్..బడవ .నేను ఏదో చిరాక్కుతో ..పో పో..అన్నా.. అట్లా..అనగానే వెళ్లిపోవడమేనా.. అలాగే వుండద్దు ..ఈ రోజు ఎక్కడ ఏమి దోరకనట్టుంది   ఆకలి కొని నీళ్లతో పొట్ట నింపుకుంటున్నావు ..ఇదో.. యింద..అంటూ  తాము తెచ్చుకున్న సద్ధి మూటకో సగం అతిడికి పెట్టి  చేతులు కడుక్కొని తనుపోరా.. “” అంటూ ఆ యాచకుడిపై దయతో ..తల్లి ప్రేమ చూపిస్త0ది  సోమయాజి భార్య..ఆ యాచకుడు కంట తడిపెడుతూ.. అమ్మా… అంటూ కాళ్లకు మొక్కబోతాడు  అపుడాళ్లు చిరునవ్వు నవ్వుతూ ..భుజంపై చేత తడిమి పోతారు .ఇతను చెట్టు కిందకు వెళ్లి తన కడుపు నింపుకుంటాడు

చూసారా.. ఆమె కటుకు అయినా.. మనస్సు  వెన్న ..అందుకే ఆమె ఎంత కోపడిన అమేముందు తాను సున్నా..

కొలువలేెనిది విలువకట్టలేనిది మానవత్వం అది మనిషిలో మిన్నగా ఉండాలి అది ఉన్నన్నాళ్లు సమాజం పరిసరాలు ఇలాగే సుభిక్షంగా..ఉంటాయి .. అని ఆ పిల్లలకు చెబుతాడు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!