జీవన గమనంలో

జీవన గమనంలో

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

ఎన్నో పయనాలు, మరెన్నో ప్రయాణాలు
ఎన్నో మదూరిమలు, మరెన్నో సంగీతాలు
ఎన్నో పరిచయాలు, మరెన్నో స్నేహ బంధాలు
మదికి దగ్గరవుతాయి, మనసుని కలవర పెడతాయి
చేరువయ్యేది ఎందుకు?  మరి దూరమయ్యేది  ఇంకెందుకో????
ఆ మాయా మర్మం తెలియని నా మనసు మాత్రం కలవరపడుతోంది.
నడివయసులో జ్ఞాపకాలు కొన్ని మాయను చేస్తాయి. కొన్ని మైమరపిస్తాయి.
అమ్మ కొంగు చాటున భయంతో దాగి ఉన్న ఆ దీపావళి ఉత్సవాల రోజు నాకింకా కళ్ళముందు కదలాడుతోంది.
స్కూల్లో నా స్నేహితుల మాటల్లోని హుషారు; ఆ పండుగ సంబరం వాళ్ళు చెప్పే ముచ్చటలు నా చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయి.
ఏదీ శాశ్వతం ఈ భూమ్మీద!!! ఏది మన సొంతం ఈ లోకంలో!!! మనిషి రూపు మాసి పోదా, ఆ మనిషి పేరు మరచిపోరా!!!
నన్ను అల్లుకున్న జ్ఞాపకాల పొదరింట, ఎన్నో మంచి సంఘటనలు, మరెన్నో గుండెను పిండేసే విషాద గాధలు.
ఎన్నో సంఘటనల మేరుకలయికతో సాగే ఈ జీవితంలో,  వెలుగుకు ఆహ్వానం పలికే ఓ చిరు దీపము ఈ పండగ హంగామా ….
జీవచ్చవంలా జీవిస్తున్న ఈ యాంత్రిక మనుషుల మనసుల్లో కొత్త ఉత్సాహం కల్పించటానికి ఏర్పడే  తొలిమెట్టు, ఏర్పడే ఓ స్నేహబంధం ఈ ప్రత్యేక హంగామా….
సరే… పండుగల గురించి చిన్న వ్యాసం వ్రాయడం పూర్తి చేశాను.
అమ్మ… ఆకలి అంటూ హడావుడి పెడుతున్నారు పిల్లలు ఇద్దరు. ఒకప్పుడు నేను తిన్న కంచం కూడా శుభ్రం చేయడానికి చిరాకు పడే నేను తల్లిగా మారిన తర్వాత ప్రేమమయ గోరు ముద్దలు ఎన్నో స్వయంగా వారికి తినిపిస్తున్నాను.
నేను ఆలోచనల్లో ఉండగానే నా మొబైల్ రింగ్ అయ్యింది. నేను పనిచేసే ఆఫీస్ నుంచి ఫోన్.
కిందటి సంవత్సరం ఈ సమయానికి, ఆఫీసులో ఉన్న విలువ కేవలం అవసరమైతే పిలిపించుకునే పిలుపు ఒక వస్తువులాంటిది. కానీ ఇప్పుడు పని చేసే మనుషులు అందుబాటులో లేకనో, నా పనితనం నచ్చో తెలియదు కానీ, నా బాస్ నన్ను అందలం ఎకించేశారు. అవసరం వాళ్లది అని మనసుకు సర్ది చెప్పుకుని అవకాశం మనది అనుకుంటూముందుకు చొచ్చుకు పోయే తత్వం నాది నువ్వు కోరుకున్నట్టు కాదు నీకు లభించిన అవకాశాలను అనువుగా చేసుకుని ముందుకు సాగిపో నీ విజయం వైపు నువ్వు మరలిపో నువ్వు చేరవలసిన గమ్యం మీ కళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది.

అలా అలా జీవిత ప్రయాణం కొనసాగుతోంది. ఏదీ శాశ్వతం కాదని తెలుసు నాకు. ఎవరి ప్రయాణం ఎంతవరకు? ఎవరి గమ్యం ఏమిటి? జవాబు తెలియని ప్రశ్నలు ఇవి. కాంతులీనే కన్నులతో

బోసినవ్వులతో బుడిబుడి అడుగులతో కల్లాకపటం తెలియని మనసుతో పసి హృదయాలు మనవడి చేరతాయి ఆనాటి సంతోషం, అందరి కన్నుల్లో దీపావళి వెలుగులు వర్ణించడం ఎవరితరం???? పుట్టి, పెరిగి, చదివి, సాధించి, పెళ్ళి, పిల్లలు, ఆప్యాయత, అనురాగం, స్నేహం, విరోధము ఇలా ఎన్నో రకాల భందాలు మన చుట్టూ… ప్రతి సందర్భంలోనూ కళ్లల్లో నూతన కాంతి ఆ అనుభవమే మన తొలి అడుగుకు నాంది అదే ప్రతి ఒక్కరి జీవితంలో నిజమైన దీపావళి భందాలు భారం కాకూడదు భాంధవ్యాలు భయ పెట్టకూడదు స్నేహ బంధం చేరువవుతుంది నిన్నెప్పటికీ విడువనంటుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!